Vaazha 2 Review : ‘వాలా 2’ మూవీ రివ్యూ.. మలయాళంలో 200 కోట్లు కొట్టిన చిన్న సినిమా.. ఎలా ఉందంటే..?
మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. (Vaazha 2 Review)
Vaazha 2 Review
Vaazha 2 Movie Review : 2024లో మలయాళంలో వచ్చిన వాలా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వాలా 2 తెరకెక్కించారు. మలయాళంలో ఏప్రిల్ 2న రిలీజయి భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా. ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన వాలా 2 ఏప్రిల్ 24న తెలుగులో రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V .. లాంటి యువ నటీనటులు కీలక పాత్రల్లో నటించగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్ నిర్మాణంలో సావిన్ SA దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు.
కథ విషయానికొస్తే..
హషిర్, అలెన్ చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. 12వ తరగతి చదివేటప్పుడు కొంతమందితో గొడవ పడి మళ్ళీ వాళ్ళతోనే కలుస్తారు. అలా హషిర్, అలెన్, అజిన్, వినాయక్ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళ స్కూల్ లో ముజీబ్ సర్ చాలా స్ట్రిక్ట్. పిల్లలపై ఎప్పుడూ కోపంగా, వాళ్ళని కొడుతూ, తిడుతూ ఉంటారు. ఓ రోజు ఓ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడం చూసి ముజీబ్ సర్ ప్లాన్ చేసి వాళ్ళ క్లాసెస్ లో లవర్స్, ఫోన్స్ తెచ్చేవాళ్లను పట్టివ్వాలి లేకపోతే పేరెంట్స్ కి చెప్తా అంటారు. అలా చాలా మంది స్టూడెంట్స్ దొరికిపోతారు. వాళ్లలో ఈ నలుగురు కూడా ఉంటారు. అలెన్ చెల్లి ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్లి దొరుకుంతుంది. ముజీబ్ సర్ చేసే కామెంట్స్ తో స్టూడెంట్స్ సర్ తో గొడవ పడతారు.
అదే సమయంలో ఆ నలుగురికి తెలిసిన జ్యూస్ షాప్ వ్యక్తి డ్రగ్స్ ఇవ్వడంతో ఆ మత్తులో వచ్చి స్కూల్ లో అందర్నీ కొట్టి పెద్ద గొడవ చేస్తారు. ఈ క్రమంలో ఒక మంచి సర్ ని కూడా కొడతారు. స్కూల్ ప్రిన్సిపాల్ వీళ్ళని ఎగ్జామ్స్ రాయనివ్వము, టిసి ఇచ్చి పంపిస్తామని అంటారు. దీంతో పోలీసులు ఎంటర్ అయి ఆ నలుగురిని తీసుకెళ్తారు. మరి ఆ ఘటన తర్వాత వీళ్ళ నలుగురి జీవితం ఎలా మారింది? వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారా? డ్రగ్స్ తీసుకున్నారని తెలిసి ఊళ్ళో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసారు? ఈ నలుగురు భాద్యతగల వ్యక్తులుగా మారతారా? హషిర్ లవర్ షైనాతో తన ప్రేమ ఏమవుతుంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
ఫస్ట్ పార్ట్ లో ఉన్న వాళ్ళతో కాకుండా అందరూ కొత్తవాళ్లతో ఈ సినిమాని తెరకెక్కించారు. టైటిల్ అదే పెట్టినా అందరూ కొత్తవాళ్లే. కానీ కథ మాత్రం మళ్ళీ ఫస్ట్ పార్ట్ లో చూపించింది చూపించారు. ఫస్ట్ పార్ట్ లో ఓ నలుగురు ఫ్రెండ్స్, కాలేజీ గొడవలు, డ్రగ్స్, తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగుతుంది. ఇందులో కూడా అంతే. పార్ట్ 2 అని పెట్టినందుకు మొదటి పార్ట్ లోని కొంతమందిని ఈ సినిమాలో అక్కడక్కడా ఇరికించారు.
ఫస్ట్ హాఫ్ అంతా చిన్నప్పటి స్నేహం, కాలేజీ గొడవలు, ప్రేమ కథలతో అక్కడక్కడా నవ్విస్తూ, ముజీబ్ సర్ ఘటన, నలుగురు కుర్రాళ్ళు డ్రగ్స్ తీసుకోవడంతో సాగి వీళ్ళ లైఫ్ ఎలా మారుతుంది అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొపారు. ఇక సెకండ్ హాఫ్ లో మిడిల్ క్లాస్ అబ్బాయిల జీవితాలు, వాళ్ళ కష్టాలు, ఇళ్లల్లో వాళ్ళ ఎమోషన్ తో మెప్పించారు. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ గొడవలతో ఎక్కువగా సాగదీస్తే సెకండ్ హాఫ్ లో వీళ్ళ ఎగ్జామ్స్ అయ్యాక ఖాళీగా తిరిగే సీన్స్ తో బాగా సాగదీశారు. లాస్ట్ అరగంట మాత్రం ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ చేసారు.
ఫాదర్ ఎమోషన్ కి కన్నీళ్లు పెట్టడం ఖాయం. చెల్లి ఎమోషన్, ఫ్రెండ్షిప్, లవ్ ఎమోషన్.. ఇలా నలుగురు జీవితాల్లో నాలుగు ఎమోషన్స్ ని క్లైమాక్స్ లో బాగా పండించారు. ముఖ్యంగా అబ్బాయిల జీవితాలు ఎలా మారిపోతాయి. బాధ్యతలు వస్తే ఎలా మారతారు అనే ఎమోషన్ చాలా మంది అబ్బాయిలకు కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో పార్ట్ 1లో నటించిన మెయిన్ నటులు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పిస్తారు. కామెడీ మాత్రం చాలా సీన్స్ లో బాగానే పండింది కానీ ఫస్ట్ పార్ట్ కంటే తక్కువే.
అలాగే స్టూడెంట్స్ ఎందుకు పక్కదారి పడుతున్నారు, పేరెంట్స్, టీచర్స్ వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు అనే పాయింట్ ని ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ లో చాలా బాగా చెప్పారు. వాలా ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్లకు పార్ట్ 2 కంటే అదే బాగుంది అనిపిస్తుంది. మరి మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. అధికారికంగా ప్రకటించకపోయినా వాలా పార్ట్ 3 కూడా ఉందని సమాచారం.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ఈ సినిమాలో ఆల్మోస్ట్ అందరూ కొత్తవాళ్లే మలయాళ నటులు నటించారు. హషిర్, అలెన్, అజిన్, వినాయక.. ఈ నలుగురు మెయిన్ లీడ్స్ లో ఫ్రెండ్స్ గా చాలా బాగా నటించారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించారు. అలెన్ చెల్లి పాత్రలో వేద శంకర్ కూడా ఎమోషనల్ గా మెప్పిస్తుంది. హషిర్ లవర్ పాత్రలో ఏంజెల్ మరియా క్యూట్ గా అలరించింది. పోలీస్ పాత్రలో ఆల్ఫన్స్ పుత్రేన్ కాసేపే కనిపించినా బాగా నటించారు. దేవరాజ్, బిజూ కుట్టన్, అజు వర్గీస్, విజయ్ బాబు.. మిగిలిన మలయాళ నటీనటులంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Michael: ఇండియాలో ‘మైఖేల్ జాక్సన్’ బయోపిక్ క్రేజ్.. లక్షల్లో టికెట్ల అమ్మకాలు.. బాక్సాఫీస్ షేక్
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కేరళ లోని రియల్ లొకేషన్స్ లో అందంగా తెరకెక్కించారు. పాటలు యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. తెలుగు డబ్బింగ్ బాగా సెట్ అయింది. తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కొట్టుకునే సీన్స్, థియేటర్ సీన్ లో కొంత, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. పార్ట్ 1 రాసిన రచయితే ఈ సినిమాని రాయగా దర్శకుడు మాత్రం మారారు. డైరెక్టర్ చక్కగా తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాని తెరకెక్కించారు.
మొత్తంగా ‘వాలా 2’ మిడిల్ క్లాస్ కాలేజీ చదివే అబ్బాయిల జీవితంలో ఎదురైన సంఘటనలతో బాధ్యతగా ఎలా మారారు అని కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించిన సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
