MLC Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్సీ అనంతబాబు ఈసారి బుక్కైనట్లేనా? అరెస్ట్ తప్పదా?
తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే యువకుడిని చంపేసి..అతడి శవాన్ని డోర్ డెలివరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబు ఆ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు.
MLC Anantha Babu: డ్రైవర్ హత్య కేసు.. ఆ నేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నాలుగేళ్ల క్రితం ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేసిన మర్డర్ కేసు..అటు ఇటు తిరిగి ఇప్పుడు ఆ లీడర్ మెడకే చుట్టుకుంటోంది. లేటెస్ట్గా సాక్షులను ప్రభావితం చేశారన్న అలిగేషన్స్ నేపథ్యంలో..ఆ నేత అరెస్టుకు రంగం సిద్ధమవుతోందట. ఇప్పటికే ఆ కేసులో కీలకంగా పని చేసిన పోలీస్ అధికారులపై వేటుపడగా..ఇప్పుడా లీడర్ కోసం వేట మొదలైందట. ఇంతకు ఎవరా ఎమ్మెల్సీ? డ్రైవర్ హత్య కేసులో అందరి వేళ్లు ఆయనవైపే ఎందుకు?
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు గండం పొంచి ఉంది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారన్న అలిగేషన్స్‌తో కేసు కొత్త టర్న్ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనంతబాబు బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇన్నాళ్లు ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో..ఇప్పటివరకు ఎలాగోలా తప్పించుకుంటూ వచ్చిన అనంతబాబుకు ఈ సారి ఉచ్చు బిగియడం ఖాయమంటున్నారు.
బెయిల్ కూడా రద్దు కావడం ఖాయం..!
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన జైలుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే యువకుడిని చంపేసి..అతడి శవాన్ని డోర్ డెలివరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబు ఆ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణ పూర్తి కాగా..నేరాభియోగాల నమోదు స్పీడప్ అవుతోంది. ఇది ముగిస్తే అనంతబాబు భవితవ్యం తేలిపోనుంది. అయితే ఈ నేరాభియోగాల నమోదును తనకు అనుకూలంగా మల్చుకునేందుకు అనంతబాబు చేసిన ప్రయత్నాలు అడ్డంగా బుక్కయ్యేలా చేశాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నేడో, రేపో ఆయన బెయిల్ కూడా రద్దు కావడం ఖాయమంటూ టాక్ బయలుదేరింది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ దుర్గ కూడా నిందితురాలిగా ఉన్నారు. ఇప్పటికే ఇదే కేసులో అనంతబాబు బెయిల్‌పై ఉండగా..లక్ష్మీ దుర్గను ఈ మధ్యే పోలీసులు రోజుల తరబడి విచారించారు. ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. సాక్షులు ఇచ్చే వాంగ్మూలాలు అనంతబాబుకు జైలా..రిలీఫా అనేది డిసైడ్ చేయనున్నాయి. ఇప్పటికే ఓ దఫా సాక్షులు అనంతబాబుకు వ్యరేతికంగానే వాంగ్మూలం ఇచ్చారు. ఈ సారి ఇచ్చే వాంగ్మూలం కూడా అనంతబాబుకు వ్యతిరేకంగా ఉంటే ఆయన పూర్తి స్థాయిలో రౌండప్ అవడం ఖాయం. ఈ విషయాన్ని గ్రహించిన అనంతబాబు ప్రధాన సాక్షులుగా ఉన్న నలుగురు వ్యక్తులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం సంచలనంగా మారింది.
సాక్షులను నిర్బంధించి డబ్బు ఎరవేసి..
సాక్షులను ఓ దగ్గరికి రప్పించి..నిర్బంధించి మరీ డబ్బు ఎరవేసి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బయపెట్టినట్లు పోలీసులకు సమాచారం చేరిందట. అత్యంత రహస్యంగా జరిగిన ఈ వ్యవహారం ఎలాగోలా పోలీసుల కంటబడిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు..అనంతబాబు అనుచరులు సాక్షులను నిర్భంధించిన అపార్ట్‌మెంట్‌కు వెళ్లారట. పసిగట్టిన అనంతబాబు తన కారుతో పాటు గన్ మెన్లను అక్కడే వదిలేసి బైక్‌పై పరారైనట్లు ఇన్సైడ్ టాక్.
ఇక పోలీసులు సాక్షులను విచారించి..తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారట. అనంతబాబుపైనా, ఆయన తరఫున సాక్షులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన మాగంటి రాంబాబు అనే వ్యక్తిపైన కేసు పెట్టారు. రాంబాబును అరెస్ట్ చేశారు. ఇక సాక్షులను ప్రభావితం చేయడానికి యత్నిస్తే..బెయిల్ రద్దు చేస్తామని గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బేస్ చేసుకుని..పోలీసులు అనంతబాబు బెయిల్ రద్దు దిశగా చర్యలు చేపట్టారు. లేటెస్ట్ ఎపిసోడ్‌తో అనంతబాబు డ్రైవర్ హత్య కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో, ఏం జరగబోతుందో చూడాలి.
Also Read: చిక్కుల్లో జగన్ కు అత్యంత సన్నిహితడు..! లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరగబోతోంది?
