వెర్రి అభిమానం.. థియేటర్లో రక్తంతో పవన్ పేరు! | Crazy fan .. Pawan's name with blood in the theater!

Vakeel Saab: వెర్రి అభిమానం.. థియేటర్లో రక్తంతో పవన్ పేరు!

మన దేశంలో సినీ నటులను దేవుళ్ళుగా కొలవడం భయాందోళన కలిగిస్తుంది. వెర్రిగా మారిన అభిమానం కొన్నిసారి శృతి మించి ప్రాణాలను బలిగొంటుంది. ఓ అభిమాని థియేటర్ లో వకీల్ సాబ్ సినిమా ప్రసారమవుతుండగా రక్తంతో తెరమీద పవన్ కళ్యాణ్ పేరు రాశాడు.

Vakeel Saab: వెర్రి అభిమానం.. థియేటర్లో రక్తంతో పవన్ పేరు!

Vakeel Saab: 5జీ యుగంలో కూడా వ్యక్తిపూజ శృతి మించుతుంది. ముఖ్యంగా మన దేశంలో సినీ నటులను దేవుళ్ళుగా కొలవడం భయాందోళన కలిగిస్తుంది. వెర్రిగా మారిన అభిమానం కొన్నిసారి శృతి మించి ప్రాణాలను బలిగొంటుంది. తమ హీరోనే గొప్పంటూ ఒకరి మీద ఒకరు దాడులకు దిగి రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులకు ఒక వైబ్రేషన్ వస్తుంది. కానీ అదే శృతిమించి వికృత చేష్టలకు దిగుతున్నారు. ఓ అభిమాని థియేటర్ లో వకీల్ సాబ్ సినిమా ప్రసారమవుతుండగా రక్తంతో తెరమీద పవన్ కళ్యాణ్ పేరు రాశాడు.

సినిమాలో పవన్ నటనకు ఉబ్బితబ్బిబయిన అయిన అభిమాని కత్తితో తన చేతిని కోసుకొని మరీ రక్తంతో వెండితెర మీద పీఎస్ పీకె అని పేరు రాశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు కానీ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. చేయి కోసుకున్న అభిమాని లాంటి కొందరు వెర్రి అభిమానులు ఈ ఘటనకు ఆహా ఓహో అంటుంటే మిగతా నెటిజన్స్ తిట్టి పోస్తున్నారు. అభిమానమంటే చేతులు, కాళ్ళు కోసుకోవడం కాదు ఆశయాలకు అండగా ఉండడమే నిజమైన అభిమానమని కొందరు హితవు పలుకుతున్నారు.

నిజానికి అభిమానులు ఇలాంటి పిచ్చి పనులు చేయడాన్ని ఏ హీరోలు హర్షించరు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇలాంటివి అసలు ఉపేక్షించరు. అభిమానం ఉంటే నలుగురికి సాయపడేలా సేవ కార్యక్రమాలు చేయాలి తప్ప.. ఇలా తన కోసం చేతులు కోసుకునే వాళ్ళని.. ప్రాణాలను తీసుకోవడం కాదు. ఇప్పటికే సినిమా వేడుకల సమయంలో కొందరు అభిమానులు ప్రాణాలు కోల్పోయి కన్నవారికి కడుపుకోత మిగిలించారు. ఇప్పుడు ఇలా వెర్రి పనులతో సదరు హీరోలలో అభిమానులు చులకన అయిపోవడం అత్యంత బాధాకరం.

read: https://10tv.in/latest/vakeel-saab-fans-demand-removal-of-flashback-episode-211243.html

×