రంజాన్ 2020 : Jumma Mubarak 

  • Publish Date - May 1, 2020 / 05:09 AM IST

రంజాన్ నెల కొనసాగుతోంది. ముస్లిం సోదరులు భక్తి ప్రవత్తులతో కఠిన ఉపవాస దీక్షలతో, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. నియమ, నిబంధనలు పాటిస్తున్నారు. దీంతో ఎప్పుడూ సందడి సందడిగా ఉండే మార్కెట్లు, మసీదులు కళ తప్పాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటే…రంజాన్ మాసంలో మొదటి శుక్రవారానికి ప్రాధాన్యత ఉంది. దీనిని మొదటి జుమ్మాగా పిలుస్తుంటారు. ప్రార్థనలు చేసుకొనేందుకు ఎవరికి వారు..ఇళ్లలోనే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. (తల్లి ప్రేమ అంటే ఇదే కదా? కూనను ఆసుపత్రికి తీసుకెళ్లిన పిల్లి)

హైదరాబాద్ విషయానికి వస్తే..ప్రఖ్యాత మక్కా మసీదులో వేలాది ముస్లిం సోదరులు హాజరై ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. వాస్తవానికి మక్కా మసీదు వేదికగా సాముహికంగా ఇమాం ముస్లింలతో ప్రార్థనలు చేస్తుంటారు. ప్రార్థనల అనంతరం యౌమల్ ఖురాన్ సభ జరుగుతుంటుంది. కానీ ఇవన్నీ ప్రస్తుతం రద్దయ్యాయి.

లాక్ డౌన్ ఉండడంతో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఉపవాస దీక్షలు ముగింపు సందర్భంగా ఉపయోగించే పండ్లు, ఇతరత్రా పదార్థాలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసింది. చార్మినార్, మక్కా మసీదు వద్ద కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. పాతబస్తీలోని ప్రధాన వీధులు, బస్తీలన్నీ నిర్మానుష్యంగా మారాయి. 

ట్రెండింగ్ వార్తలు