తల్లి ప్రేమ అంటే ఇదే కదా? కూనను ఆసుపత్రికి తీసుకెళ్లిన పిల్లి

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 04:31 AM IST
తల్లి ప్రేమ అంటే ఇదే కదా? కూనను ఆసుపత్రికి తీసుకెళ్లిన పిల్లి

విశ్వమంతా ఎక్కడైనా తల్లి ప్రేమ.. తల్లి ప్రేమే.. జంతువులకు.. మనుషులకు అనే తేడా లేదు.. ఎక్కడైనా అమ్మ ప్రేమ ఒక్కటే అని అనిపించే ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే.. ఇస్తాంబుల్‌లోని టర్కీలో ఓ ఆసుపత్రి అత్యవసర గదిలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

విషయం ఏంటంటే.. మెర్వ్ ఓజ్కాన్ ట్విట్టర్లో పంచుకున్న వివరాల ప్రకారం.. ఒక తల్లి పిల్లి జబ్బుపడిన తన పిల్ల పిల్లి(కూన)ని ఆసుపత్రికి తీసుకొచ్చింది.హుషారుగా ఉండే బిడ్డ నీరసించి పోవడంతో, ఆందోళనకు గురైన తల్లి పిల్లి, దానిని నోటితో పట్టుకుని ఆసుపత్రికి తీసుకుని వచ్చింది అని చెప్తున్నారు.

వైద్యుల ముందు కూనను ఉంచి, వారి చుట్టూ తిరగడంతో పిల్లి బాధను అర్థం చేసుకున్న వైద్యులు పిల్లి పిల్లకు వైద్యం చేసినట్లు డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఆ పిల్లి పిల్ల ఆరోగ్యంతో కనిపిస్తుంది. ఆ ఫోటోలను మెర్వ్ ఓజ్కాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి.

జంతువులపై డాక్టర్ల ప్రేమ, గౌరవం చూసినవారు పిల్లులకు అవసరమైన సహాయం అందించినందుకు వారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read | అమెరికాకు యానిమేటెడ్ వీడియోలో చైనా ఎంబస్సీ కౌంటర్