CM Vijay : విజయ్ అనే నేను.. సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారోత్సవం.. హాజరయ్యే ప్రముఖులు వీరే..
CM Vijay : ఇవాళ ఉదయం 10గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 13వ తేదీ నాటికి అసెంబ్లీలో బలనిరూపణ ద్వారా మెజార్టీ చూపాలని విజయ్‌తో పాటు వెంట వచ్చిన మిత్రపక్షాల ప్రతినిధులకు గవర్నర్ సూచించారు.
CM Vijay
- తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెర
- నేడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
- హాజరుకానున్న రాజకీయ, సినీ ప్రముఖులు
CM Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత, సినీ నటుడు సి.జోసెఫ్ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనకు మద్దతిచ్చే పార్టీల సమ్మతి లేఖలతో నాలుగోసారి శనివారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను విజయ్ కలిశారు. అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను అంటూ విజయ్‌కు గవర్నర్ ఉత్తర్వులు ప్రతిని అందించారు. దీంతో ఇవాళ ఉదయం 10గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 13వ తేదీ నాటికి అసెంబ్లీలో బలనిరూపణ ద్వారా మెజార్టీ చూపాలని విజయ్‌తో పాటు వెంట వచ్చిన మిత్రపక్షాల ప్రతినిధులకు గవర్నర్ సూచించారు.
Also Read : TN Governor – TVK Vijay: విజయ్ అనే నేను.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీవీకే చీఫ్..
టీవీకే పార్టీని ఏర్పాటు చేసిన తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్.. ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 10గంటలకు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ విజయ్ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం లేకపోవటంతో కొద్ది మంది రాజకీయ, సినీ ప్రముఖులను విజయ్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించినట్లు సమాచారం.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అవసరం. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాల్లో విజయఢంకా మోగించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించకపోయినా.. కాంగ్రెస్, ఇతర వామపక్షాల మద్దతుతో విజయ్ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించారు. అలాగే సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అండగా నిలిచారు. దీంతో అసెంబ్లీలో విజయ్ బలం 120కి చేరింది.
