TN Governor – TVK Vijay: విజయ్ అనే నేను.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీవీకే చీఫ్..
కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు టీవీకేకి మద్దతు ప్రకటించాయి. దాంతో టీవీకే బలం 120కి పెరిగింది.
TN Governor – TVK Vijay: ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ టీవీకే చీఫ్ విజయ్ ను ఆహ్వానించారు. దాంతో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని, నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండనుందని తెలుస్తోంది. కాగా, రేపు కాదు ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. కాగా కొన్ని రోజులుగా తమిళ రాజకీయాల్లో కొనసాగిన నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ.. ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

అంతకుముందు తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తొలుత విజయ్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దాంతో విజయ్ లోక్ భవన్ నుంచి నిరాశతో వెనుదిరిగారు. ఆ కాసేపటికే గవర్నర్ తన మనసు మార్చుకున్నారు. కేరళం పర్యటన రద్దు చేసుకుని విజయ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. దాంతో విజయ్ లోక్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ ని కలిశారు. పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు అందించారు విజయ్. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ ను ఆహ్వానించారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.

కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు టీవీకేకి మద్దతు ప్రకటించాయి. దాంతో టీవీకే బలం 120కి పెరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను (118) అందుకోవడమే కాదు ఇంకా రెండు సీట్లు ఎక్కువే వచ్చాయి విజయ్ కి. కాంగ్రెస్ కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఎం కి ఇద్దరు, సీపీఐకి ఇద్దరు, వీసీకేకి ఇద్దరు, ఐయుఎంఎల్ కి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక విజయ్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
టీవీకే – 107
కాంగ్రెస్ – 5
సీపీఐ – 2
సీపీఎం – 2
వీసీకే – 2
ఐయుఎంఎల్ – 2
Also Read: నెట్టింట వైరల్ అవుతోన్న విజయ్ మార్క్స్ షీట్.. ఆ సబ్జెక్ట్ అంటే దళపతికి కూడా భయమే.. జస్ట్ పాస్..!
