AP Weather: ఏపీకి రెయిన్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
పిడుగులతో కూడిన వానలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
AP Weather: ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసమీ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది.
పిడుగులతో కూడిన వానలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరీ ముఖ్యంగా రైతులు, పశుకాపరులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పంట పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద, కరెంట్ పోల్స్ కింద ఉండొద్దని చెప్పింది. వర్షం పడుతున్న సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే తలదాచుకోవాలని స్పష్టం చేసింది.
Also Read: గోల్డ్ బ్యాన్, ఖర్చులు తగ్గించుకోండి, త్యాగాలకు సిద్ధంకండి.. ప్రధాని మోదీ సంచలన పిలుపు
సోమవారం (11-05-26) మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA తెలిపింది. pic.twitter.com/H0pewZWPZU
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 10, 2026
