Modi Telangana Tour : హైదరాబాద్ చేరుకున్న మోదీ.. రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
Modi Telangana Tour : మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ తొలిసారి నేడు తెలంగాణలో పర్యటించారు.
narendra modi telangana tour virtually starts and inagurate rs 9377 cr development works and his speech highlites
Modi Telangana Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పర్యటించారు. వరుసగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మోదీ తొలిసారి నేడు రాష్ట్రానికి వస్తుండటం రాజకీయంగా కీలకంగా మారింది. నేటి పర్యటనలో మోదీ రాష్ట్రంలో రూ. 9 వేల కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనున్నారు. సుమారు 5 గంటలపాటు మోదీ నగరంలో పర్యటించనున్నారు.
హైదరాబాద్ చేరుకున్న మోదీ… HICCలో వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్దపీట వేశారు. మౌలిక సదుపాయాలు, ఇంధన, రవాణా రంగాలకు సుమారు రూ. 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిల్లో ముఖ్యమైన ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్‌తో పాటు NH-167లో గుడెబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు 4 వరుసల రహదారి పనులకు ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ విలువ 3,175 కోట్ల రూపాయలు అని సమాచారం.
- ఆ తర్వాత జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా. 2,360 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేశారు.
- 1,243 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ మూడో రైల్వే లైన్ పనులు వర్చువల్ గా ప్రారంభించారు.
- వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రారంభం.
- హైదరాబాద్ మల్కాపూర్‌లో పెట్రోలియం టెర్మినల్ ప్రారంభం
అనంతరం మోదీ మాట్లాడుతూ.. హైదరాబాద్ తెలంగాణకే కాదు దేశానికి కూడా కీలకం. దేశ అభివృద్ధిలో సైబరాబాద్ ది ప్రధాన పాత్ర. సైబరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్ ను తీర్చిదిద్దుతున్నాం. సైబరాబాద్ అభివృద్ధికి కేంద్రం వేల కోట్లు కేటాయించింది. ఈ కొత్త ప్రాజెక్టులతో తెలంగాణను ప్రపంచంతో కనెక్ట్ చేయడమే కాక.. ఉద్యోగ కల్పన చేస్తున్నాం. అభివృద్ధిలో జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కీలకం. పదేళ్లలో జాతీయ రహదారులను అభివృద్ధి చేశాం. రూ. 1.75 లక్షల కోట్లతో దేశంలో కనెక్టివిటీ పెంచుతున్నాం అని తెలిపారు.
తెలంగాణ రైల్వే బడ్జెట్ ను కూడా రూ. 5,500 కోట్లకు పెంచాం. తెలంగాణకు 5 వందే భారత్, 6 అమృత భారత్ రైళ్లు కేటాయించాం. కాజీపేట రైల్వే జంక్షన్ ని అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు.
