Vijay CM CSK Won Title : విజయ్ సీఎం అయ్యాడు.. CSK టైటిల్ గెలుస్తుంది.. మాములు లాజిక్కు కాదు కదా..!
Vijay CM CSK Won Title : విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడు.. అలానే ఈసారి సీఎస్కేనే ఐపీఎల్ టైటిల్ సాధిస్తుంది అంటున్నారు అభిమానులు.
TVK joseph vijay became cm tamil nadu fans said csk wins ipl title
Vijay CM CSK Won Title : తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు టీవీకే అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. మే 10, ఆదివారం ఉదయం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆధ్వర్యంలో సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రత్యేక అతిథిగా తరలి వచ్చారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ తెర మీదకు వచ్చింది. విజయ్ సీఎం అయ్యాడు.. అలానే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందంటూ జోరుగా చర్చించుకుంటున్నారు. విజయ్ ముఖ్యమంత్రి కావడానికి.. సీఎస్కే కప్పు కొట్టడానికి సంబంధం ఏంటంటే..
తమిళనాడులో ప్రభుత్వాలు మారి కొత్త సీఎంలు వచ్చిన ప్రతి సారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సాధించిందంటున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టుగా ఉదాహరణలు కూడా చెబుతున్నారు. 15 ఏళ్ల క్రితం అంటే.. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అయినప్పుడు సీఎస్కే టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత 2021లో స్టాలిన్ సీఎం అయినప్పుడు కూడా సీఎస్కేనే టైటిల్ సాధించింది. ఇప్పుడు విజయ్ సీఎం కావడంతో ఈ ఏడాది కూడా ఇదే సెంటిమెంట్ రిపీటవుతుందని మరోసారి సీఎస్కేనే టైటిల్ సాధిస్తుందని ఫ్యాన్స్ బల్లగుద్ది మరి చెబుతున్నారు.
*రంగంలోకి దిగిన స్టాలిన్.. విజయ్ తొలి ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు.. ఇక ముందుంది ముసళ్ల పండగ..!
వాస్తవంగా చూసుకుంటే.. ప్రస్తుతం సీఎస్కే పరిస్థితి చూసుకుంటే ఈ సెంటిమెంట్‌కు దగ్గరగానే ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి వరుస ఓటములు చవి చూసిన సీఎస్కే జట్టు అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. సంజూ శాంసన్ ఆ జట్టు తలరాతను మార్చాడు. రెండు శతకాలు, ఓ అర్ధ శతకం సాధించి సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచినా, ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైనట్లే.
