AP POLYCET Results 2026 : ఏపీ పాలీసెట్ -2026 ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్.. ఇక్కడ చెక్ చేసుకోండి..
AP POLYCET Results 2026 Link : పాలిటెక్నిక్ లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలీసెట్ -2026 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ ట్విటర్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు.
AP Polycet Results 2026
AP POLYCET Results 2026 : పాలిటెక్నిక్ లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలీసెట్ -2026 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ ట్విటర్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు.
పాలిసెట్ ప్రవేశాల కోసం మొత్తం 1,77,581 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 1,48,950 మంది అర్హత సాధించి.. మొత్తం 91.37శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి బాలికలు బాలుర కంటే మెరుగైన ప్రతిభ కనబర్చారు. బాలికలు 93.57శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
గిరిజన ప్రాంతాల విద్యార్థులు కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 99.11శాతం, పోలవరం జిల్లా 95.46శాతం, పార్వతీపురం మన్యం జిల్లా 93.45శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో అగ్ర స్థానాల్లో నిలిచాయి.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. విజయం సాధించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈసారి అర్హత సాధించలేకపోయిన వారు నిరుత్సాహానికి గురికావొద్దని, మరింత కృషిచేసి భవిష్యత్తులో విజయాన్ని అందుకోవాలని సూచించారు.
ఫలితాలను polycetap.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. లేదంటే మన మిత్ర వాట్సాప్ నెంబర్ 95523 00009 నెంబర్ కు హాయ్ అని మెస్సేజ్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
🔊 AP POLYCET–2026 Results Announced! 📢
This year, a record 1,77,581 candidates registered and 1,63,008 appeared for the examination held on 25.04.2026 — the highest participation ever. Of these, 1,48,950 have qualified, with an overall pass percentage of 91.37%.👏 Delighted…
— Lokesh Nara (@naralokesh) May 5, 2026
