IPL 2026: వాటే మ్యాచ్.. బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ.. ముగిసిన ముంబై కథ
IPL 2026: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీనే విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్ల నష్టానికి 166 పరుగులే చేసింది. 167 రన్స్ టార్గెట్ ను ఆర్సీబీ చివరి బంతికి చేజ్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కృనాల్ పాండ్యా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఓ ఎండ్ లో వికెట్లు పడినా కృనాల్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లోనే 73 రన్స్ చేసి.. తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్ లో టాప్ కి దూసుకెళ్లింది బెంగళూరు. ఈ మ్యాచ్ లో ఓటమితో టోర్నీ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది.
