The Paradise: ఇంట్రెస్ట్ పోయేలా చేస్తున్నారు.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇంకా అనుమానాలే
బడ్జెట్ లిమిట్స్ దాటిపోతున్న నాని ది ప్యారడైజ్(The Paradise).
Nani The Paradise movie crossing budget limits and over budget
- నాని కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా.
- దసరా దర్శకుడితో మాస్ చిత్రం.
- వసూళ్ల లెక్కలపై విశ్లేషకుల ఆందోళన.
The Paradise: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ సినిమా ‘ప్యారడైజ్(The Paradise)’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సాంగ్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. వినూత్న కంటెంట్‌తో పాటు బలమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ ప్రాజెక్ట్‌ను తన కెరీర్‌కు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే ఆయన స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరడం ఖాయం, లేదంటే కెరీర్ పరంగా పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే ఈ సినిమా బడ్జెట్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొదట రూ.100 కోట్లతో అనుకున్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్లకు పైగా చేరినట్లు సమాచారం. నానికి ఉన్న ప్రస్తుత మార్కెట్ పరిమితుల దృష్ట్యా, ఇంత భారీ బడ్జెట్ రికవరీ చేయడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. యంగ్ హీరోలు సైతం భారీ వసూళ్లు రాబడుతున్న తరుణంలో, నాని ఇంకా రూ.200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టకపోవడం ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్ల పరంగా బడ్జెట్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు మేధావులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటివరకు పక్కింటి కుర్రాడిలా మెప్పించిన నాని, ఇప్పుడు పూర్తిస్థాయి మాస్ అవతారంలోకి మారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. నాని తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నప్పటికీ, ఈ భారీ బడ్జెట్ సాహసం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. కేవలం కథపైనే కాకుండా బిజినెస్ లెక్కల మీద కూడా దృష్టి పెడితేనే ఈ సినిమా సంపూర్ణ విజయం సాధించినట్లవుతుంది. ఈ ‘ప్యారడైజ్’ నాని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక వాయిదాల వల్ల కూడా సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పోతుంది అనే చెప్పాలి. కాబట్టి, ఆ విషయంలో కూడా మేకర్స్ జాగ్రత్త పడటం మంచిది.
