Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాలకు ఎనిమిది ప్రత్యేక రైళ్లు.. అన్నీ అన్‌రిజర్వుడ్ బోగీలే.. పొడిగించిన రైళ్ల పూర్తి వివరాలు ఇవే..
Special Trains : హైదరాబాద్‌లోని వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ఎనిమిది జన సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లలో అన్నీ అన్ రిజర్వుడ్ బోగీలే ఉంటాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
Sankranti Special trains
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
- దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
- ఎనిమిది జన సాధారణ్ ప్రత్యేక రైళ్లు
- వీక్లీ స్పెషల్ రైళ్లు మరికొన్ని వారాలు పొడిగింపు
Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ హైదరాబాద్‌లోని వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ఎనిమిది జన సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లలో అన్నీ అన్ రిజర్వుడ్ బోగీలే ఉంటాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
ఎనిమిది ప్రత్యేక రైళ్లు మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, కర్నూలు, విజయవాడల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో కాచిగూడ, మల్కాజిగిరి స్టేషన్ల నుంచి బయల్దేరుతాయి. ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, కొల్నూరు, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకొండ, వనపర్తి రోడ్, గద్వాల, ఇటిక్యాల, మనోపాడ్, అలంపూర్ రోడ్డ, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, బోనకల్, మధిర, ఎర్రుపాలెం స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు.
మరోవైపు.. వేసవి సెలవుల కారణంగా రైళ్లలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు ప్రస్తుతం నడుస్తున్న పలు వీక్లీ స్పెషల్ రైళ్లను మరికొన్ని వారాలపాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో ఏపీ, తెలంగాణ నుంచి తమిళనాడు, కేరళ వైపునకు వెళ్లే ప్రయాణికులకు ఊరట కలగనుంది.
♦ నర్సాపూర్ – తిరువణ్ణామలై (రైలు నం. 07219/07220) : ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే భక్తులకోసం ఈ రైలును పొడిగించారు. నర్సాపూర్ – తిరువణ్ణామలై రైల్వే జూన్ 3 నుంచి జూన్ 24 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. తిరువణ్ణామలై – నర్సాపూర్ రైలు జూన్ 4 నుంచి జూన్ 25వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. మొత్తం నాలుగు అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
♦ హైదరాబాద్ – కొల్లాం (రైలు నం. 07193/07194) : కేరళ పర్యాటకానికి వెళ్లేవారికి, దక్షిణ భారత్ యాత్రికులకు ఈ రైలు ఎంతో కీలకం. ఈ రైలు హైదరాబాద్ – కొల్లాం వరకు మే 30 నుంచి జూన్ 27 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. కొల్లాం నుంచి హైదరాబాద్ కు జూన్ 1 నుంచి జూన్ 29 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం ఐదు సర్వీసులుంటాయి.
♦ చర్లపల్లి – తిరుచిరాపల్లి (రైలు నం. 07615/07616): హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి టెర్మినల్ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. చర్లపల్లి – తిరుచిరాపల్లికి జూన్ 9 నుంచి జూన్ 30వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది. తిరుచిరాపల్లి – చర్లపల్లికి జూన్ 10 నుంచి జులై 1వ తేదీ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో నాలుగు సర్వీసులు పొడిగించారు.
