Software Engineer Suicide : కన్నీరు పెట్టిస్తోన్న సూసైడ్ నోట్.. ‘నా భార్యకు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ వీడియోలు’
Software Engineer Suicide : రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సీతారం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
hyderabad software engineer sitaram ends his life over wife extra marital affairs
Software Engineer Suicide : హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చనిపోవడానికి ముందు తన భార్య రేణుక ప్రవర్తన గురించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసిన సీతారాం.. ఆమె దారుణాలను వెల్లడించాడు. తన భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా.. ఆమె మాత్రం ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. పైగా వారితో కలిసి ఉన్న ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేసుకోగా.. ఆమె లవర్ ఒకడు దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి తాను తట్టుకోలేకపోతున్నానని.. అసలు తన భార్యకు కావాల్సింది ప్రేమా లేక శృంగారమా అని ప్రశ్నిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
భార్య ఆగడాలు భరించలేక ఆమెను ఏం చేయలేక.. చివరకు తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం. ఏ అమ్మాయి కూడా అలా చేయవద్దంటూ సీతారాం తన వేదనను లేఖ రూపంలో పంచుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురానికి చెందిన సీతారాంకు 2018లో నంద్యాలకు చెందిన రేణుక అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరు బాచుపల్లిలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలోనే.. భార్య వివాహేతర సంబంధాల గురించి సీతారాంకు తెలిసింది. పైగా అతడి భార్య ప్రైవేటు వీడియోలు ఇన్‌స్టాలో బయటపడటంతో.. ఆ దారుణాన్ని భరించలేకపోయిన సీతారాం ఫిబ్రవరిలో ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే.. సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తాను చనిపోవడానికి కారణం తన భార్య రేణుక వివాహేతర సంబంధాలే అని తెలిపాడు. ‘ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయడం ఏంటి.. రమణ అనే వ్యక్తి ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.. వాటిని చూసి నేను ఎలా తట్టుకోవాలి.. అవి చూశాకే తెలిసింది నా భార్య నిజస్వరూపం.. నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా.. కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది’’.. అంటూ సూసైడ్ లెటర్లో సీతారాం ఆవేదన వ్యక్తంచేశాడు.
తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య ఆమె లవర్స్‌ని పిలిపించుకుని ఎంజాయ్ చేసేదని.. ఆమె నిజస్వరూపం తెలిసిన తర్వాత ఆ దారుణాలు తట్టుకుని నిలబడే ధైర్యం తనకి లేదని.. అందుకే తాను చనిపోతున్నాను అని సూసైడ్ నోట్లో ప్రస్తావించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సూసైడ్ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్టయ్యారు. రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే సీతారాం తండ్రి మాట్లాడుతూ.. తన కోడలికి ఆరుగురు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
