Mars Jupiter Conjunction 2026 : 12 సంవత్సరాల తర్వాత ఆ 2 గ్రహాల అరుదైన కలయిక.. ఆహా ఈ రాశుల వారికి రాజయోగం.. వారు చెప్పిందే శాసనం..!
Mars Jupiter Conjunction 2026 : ఖగోళంలో 12 సంవత్సరాల తర్వాత అరుదైన గ్రహాల కలయిక జరగబోతుంది.
after 12 years mars jupiter conjunction rare celestial event bringing luck to 5 zodiac signs
Mars Jupiter Conjunction 2026 : జ్యోతిష్య శాస్త్రంలో కొన్నిసార్లు గ్రహాల కలయిక వల్ల అరుదైన యోగాలు ఏర్పడుతుంటాయి. అలానే కొన్ని గ్రహాల మధ్య అరుదైన కలయికలు సంభవిస్తుంటాయి. ప్రస్తుతం 12 సంవత్సరాల తర్వాత కుజ, గురు గ్రహాల సంయోగం జరగనుంది. జూన్ 1న ఈ రెండు గ్రహాలు వృషభ రాశిలో కలవనున్నాయి. ఇది 12 రాశుల మీద ప్రభావం చూపుతుండగా.. ఐదు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం:
వృషభ రాశి:
కుజ, గురు గ్రహాలు వృషభ రాశిలోనే సంయోగం చెందడం వల్ల ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన కాలం రాబోతుంది. వీరి జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మునపటి కంటే మెరుగుపడుతుంది.
మకర రాశి:
మకర రాశి వారికి వృషభ రాశిలో జరగబోయే ఈ అరుదైన గ్రహాల కలయిక వల్ల అద్భుతమైన ఫలితాలు, లాభాలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు (ప్రమోషన్లు) లభిస్తాయి. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ యోగం వల్ల మకర రాశి వారికి చేతినిండా డబ్బు ఉంటుంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రెండు గ్రహాల కలయిక వీరికి విశేష లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా, ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకుంటారు.
మీన రాశి:
మీన రాశి వారికి కుజ, గురు గ్రహాల కలయిక వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి మీ సొంతం అవుతుంది.
సింహ రాశి:
గురు, కుజ గ్రహాల కలయిక వల్ల సింహ రాశి వారికి అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి వారి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనేక విధాలుగా లాభాలు పొందుతారు. కొత్త ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.
