RedMagic 11S Pro : BGMI ఫ్యాన్స్ రెడీ అవ్వండి.. మే 18న దుమ్మురేపే రెడ్‌మ్యాజిక్ 11S ప్రో.. గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి భయ్యా..!
RedMagic 11S Pro : రెడ్‌మ్యాజిక్ 11S ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 అప్‌గ్రేడ్ వెర్షన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఆ చిప్‌సెట్‌లో ఇదే టాప్ వెర్షన్ కానుంది.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
RedMagic 11S Pro ( Image Credit : AI )
- ఈ గేమింగ్ ఫోన్ మే 18న మార్కెట్లో లాంచ్ కానుంది
- ఈ ఫోన్లో అద్భుతమైన హార్డ్‌వేర్ ఫీచర్లు ఉంటాయి
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 అప్‌గ్రేడ్ వెర్షన్ హైలెట్
RedMagic 11S Pro : గేమర్ల కోసం అద్భుతమైన ఫోన్ వచ్చేస్తోంది. రెడ్‌మ్యాజిక్ 11S ప్రో లాంచ్ డేట్ తెలిసిందోచ్. ఈ బ్రాండ్ ప్రకారం.. కంపెనీ ఈ గేమింగ్ ఫోన్‌ను మే నెల మూడో వారంలో లాంచ్ చేయనుంది.
రెడ్‌మ్యాజిక్ 11S ప్రో పవర్ఫుల్ చిప్సెట్తో అద్భుతమైన ఫోన్‌గా రాబోతుంది. అయితే, స్పెషల్ గేమింగ్ ఫోన్ ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయని చెబుతున్నారు. రెడ్‌మ్యాజిక్ 11S ప్రో లాంచ్ ముందే కీలక ఫీచర్లన్నింటినీ ఇప్పుడు పరిశీలిద్దాం..
రెడ్‌మ్యాజిక్ 11S ప్రో లాంచ్ తేదీ ఖరారైంది. కంపెనీ ఈ ఫోన్‌ను మే 18న లాంచ్ చేస్తోంది. కంపెనీ వీబోలో టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే హార్డ్‌వేర్ ఫీచర్లను వెల్లడించింది. ఈ ఫోన్లో ఓవర్‌క్లాక్ చిప్సెట్ కూడా ఉంది.
అద్భుతమైన ఫీచర్లు, చిప్ సెట్ టాప్ వెర్షన్ :
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 మెరుగైన వెర్షన్‌ను ఉపయోగిస్తుంది. చిప్సెట్లలో టాప్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఈ వెర్షన్ చాలా హై క్లాక్ స్పీడ్‌తో రన్ అవుతుంది. 4.74GHz వద్ద కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించేలా రూపొందింది.
Read Also : PAN Card Misuse : లోన్ తీసుకోలేదా? అయినా డిఫాల్టర్ అవుతారు జాగ్రత్త.. పాన్ కార్డు ఉన్నవారు తప్పక తెలుసుకోండి
ఈ చిప్సెట్ అదనపు పవర్, హై ఫ్రీక్వెన్సీతో వస్తుంది. హీటింగ్ మెనేజ్మెంట్ పవర్ సామర్థ్యంతో వస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అందించే వెర్షన్‌ను ఉపయోగిస్తుంది. రెడ్‌మ్యాజిక్ ఈ ఫోన్ కోసం టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కోసం కంపెనీ చిప్సెట్ చాలా ప్రత్యేకమైన వెర్షన్‌ను అభివృద్ధి చేసిందని ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది.
రిపోర్టుల ప్రకారం.. రెడ్‌మ్యాజిక్ 11S ప్రో పవర్ఫుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 2K రిజల్యూషన్‌లో 200కు పైగా సపోర్ట్ చేసే గేమ్‌లను రన్ చేయగలదు. ఇది 144fps సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.
కాల్ ఆఫ్ డ్యూటీ బ్రేక్ త్రూ ది డార్క్ జోన్ వంటి టైటిల్స్‌ను కూడా హై రిజల్యూషన్‌లో ఆడవచ్చని చెబుతున్నారు. గేమింగ్ ప్రియుల కోసం ఈ ఫోన్ గేమింగ్‌ను నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లగలదు. లాంచ్ సమయంలో ఈ ఫోన్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
