China death van : చైనాలో ‘డెత్ వ్యాన్’లు అంటే ఏమిటి? వాటిలో నేరస్తులను తీసుకెళ్లి ఏం చేస్తారు.. ఆ ప్రాణాంతక ఇంజెక్షన్లు ఎందుకిస్తారో తెలుసా?
China death van : చైనా ప్రభుత్వం ఈ వాహనాలను 2003 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. బయటికి చూడటానికి ఇవి సాధారణ వాహనాలుగా, పోలీస్ మినీ బస్సులుగా కనిపిస్తాయి. కానీ, లోపల ఖైదీలకు ఉరిశిక్షను అమలు చేసే గదులు ఉంటాయి.
China Death Van
- చైనాలో ‘డెత్ వ్యాన్’లు
- వాటిలో నేరస్తులకు ఉరిశిక్షలు అమలు
- నొప్పిలేకుండా ప్రాణం పోయేలా ఇంజెక్షన్లు
China death van : చైనా డెత్ వ్యాన్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వీటి గురించి చర్చ జరుగుతోంది. చైనాలో డెత్ వ్యాన్స్ పేరుతో పిలవబడుతున్న మొబైల్ ఎగ్జిక్యూషన్ వాహనాలు.. బయటకు సాధారణ పోలీస్ వ్యాన్లా కనిపిస్తాయి. కానీ, ఈ వాహనాల లోపల ప్రత్యేకంగా మరణశిక్ష అమలు చేసే ఏర్పాట్లు ఉంటాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
చైనా ప్రభుత్వం ఈ వాహనాలను 2003 సంవత్సరంలో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. బయటికి చూడటానికి ఇవి సాధారణ వాహనాలుగా, పోలీస్ మినీ బస్సులుగా కనిపిస్తాయి. కానీ, లోపల ఖైదీలకు ఉరిశిక్షను అమలు చేసే గదులు ఉంటాయి. ఈ వ్యాన్లు సుమారు ఏడు మీటర్ల పొడవు ఉంటాయి. స్థానిక న్యాయస్థానాలు ఖైదీలకు మరణశిక్ష ఉత్తర్వులు జారీ చేసినప్పుడల్లా వివిధ పట్టణాలు, నగరాల్లో ఈ వాహనాలను ఉపయోగిస్తున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఉరిశిక్ష అమలు ప్రక్రియ ప్రారంభయ్యే ముందు ఖైదీలను కట్టివేయడానికి ఒక స్ట్రెచర్ కూడా ఈ వాహనాలో ఉంటుంది. వ్యాన్‌లో ఉరిశిక్ష అమలు చేసే బృందంలో పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది, సాంకేతిక నిపుణులు ఉంటారు. ఈ వాహనాల్లోకి ఖైదీలను ఎక్కించి ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేయడానికి ఈ వాహనాలను ఉపయోగిస్తున్నారు. చైనా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జైళ్లలో ప్రత్యేక మరణ శిక్ష అమలుచేసే కేంద్రాలు నిర్మించాల్సిన అవసరం లేకుండా, అవసరమైన ప్రాంతాలకు ఈ వాహనాలను తీసుకెళ్లి అక్కడికక్కడే శిక్ష అమలు చేసేలా వీటిని వినియోగిస్తున్నారు.
నివేదికల ప్రకారం.. ఖైదీలను వ్యాన్‌లోకి తీసుకురావడానికి ముందు వారికి మత్తు మందు ఇస్తారు. ఆ తరువాత వారిని స్లైడింగ్ స్ట్రెచర్ పై పడుకోబెట్టి.. తాడు లాంటి పట్టీలతో కట్టేస్తారు. ఆటోమేటిక్ సిస్టమ్‌కు అనుసంధానించబడిన ఇంట్రావీనస్ ట్యూబ్ ద్వారా ప్రాణాంతక ఇంజెక్షన్ ను ఖైదీకి ఇస్తారు. రాష్ట్ర మార్గదర్శకాలకు అనుగుణంగా విధానాలు జరుగుతాయని చెబుతున్నారు. అయితే, ఈ వాహనం లోపల అమర్చిన కెమెరాలు, వీడియో స్ర్కీన్ ల ద్వారా ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారని నివేదికలు చెబుతున్నాయి.
ఉరిశిక్ష అనంతరం బాధితుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత వైద్య బృందం మొదల కళ్లను తొలగిస్తుంది. ఆ తరువాత సర్టికల్ గౌన్లు, మాస్కులు ధరించి మూత్రపిండాలు, కాలేయం, క్లోమం, ఊరిపితిత్తులను తొలగిస్తారు. ముందుల వల్ల విషపూరితమైనందున గుండెను ఉపయోగించరు. మిగిలిన అవయవాలను ఐస్ బాక్సుల్లో భద్రపర్చి బీజింగ్, షాంఘై, గ్వాంగ్ జౌ వంటి పెద్ద నగరాల్లోని ఆస్పత్రులకు పంపిస్తారని తెలుస్తోంది. ఈ ఆస్పత్రులు ద్వారా వాటిని వేరే వ్యక్తులకు అమర్చుతారని ప్రచారంలో ఉంది.
ప్రస్తుతం వాడుకలో ఉన్న డెత్ వ్యాన్ల సంఖ్యను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుంది. కానీ, ఒక్క యువాన్ ప్రావిన్సులోనే 18 మొబైల్ యూనిట్లు ఉన్నాయని, మరో ఐదు పెద్ద ప్రావిన్సులలో డజన్ల కొద్దీ ఇతర వ్యాన్లు గస్తీ కాస్తున్నాయని తెలిసింది. అయితే,
