Bandi Sanjay: కుట్ర జరుగుతోంది..! కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై బండి సంజయ్ రియాక్షన్..
ఏది సరైనదో, ఏది తప్పో న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నా. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది.
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అవి నిరాధారమైన ఆరోపణలు అని చెప్పారు. తన ప్రజా జీవితమంతటా ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని తెలియజేశారు. తాను ఎలాంటి మచ్చ లేకుండా జీవించానని వెల్లడించారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందన్నారు.
పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది, తనతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతను మాత్రమే ప్రతిబింబిస్తుందన్నారు. క్షేత్రస్థాయి నుండి వచ్చి, కార్పొరేటర్‌గా పని చేసి, కఠోర శ్రమ ప్రజా మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు.
”రేపు ప్రధాని మోదీ బహిరంగ సభకు ముందు, నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని స్పష్టమవుతోంది. ఏది సరైనదో, ఏది తప్పో న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నా. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది. ప్రతి కుట్రను బయటపెడుతుంది. సత్యమేవ జయతే” అని ఎక్స్ వేదికగా స్పందించారు బండి సంజయ్.
నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన
నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.
నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 9, 2026
