Independence Day Celebrations Red Fort : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట..10వేల మంది పోలీసులతో భద్రత..1000 సీసీ కెమెరాలు ఏర్పాటు

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. ఎర్రకోట వద్ద అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వేల మందికి పైగా పోలీసులతో అధికారులు ఎర్రకోట వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే చుట్టూ ఏం జరిగినా వెంటనే తెలిసేలా ఎర్రకోట చుట్టూ 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతా పర్యవేక్షణకు ఎర్రకోట వద్ద కంట్రోల్ రూమ్స్, మొబైల్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.

Independence Day Celebrations Red Fort : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. ఎర్రకోట వద్ద అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వేల మందికి పైగా పోలీసులతో అధికారులు ఎర్రకోట వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే చుట్టూ ఏం జరిగినా వెంటనే తెలిసేలా ఎర్రకోట చుట్టూ 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతా పర్యవేక్షణకు ఎర్రకోట వద్ద కంట్రోల్ రూమ్స్, మొబైల్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. 100 పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్‌లు, తక్షణ స్పందన బృందాల మోహరించారు.

ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, NSG స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వార్డ్స్‌ను మోహరించారు. డ్రోన్ దాడులు జరగొచ్చన్న నేపథ్యంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా DRDO ఏర్పాటు చేసింది. 4 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌లను గుర్తించి, నియంత్రించ గల యాంటీ డ్రోన్ వ్యవస్థను ఎంతో వ్యూహాత్మకంగా భద్రతా అధికారులు ఏర్పాటు చేశారు.

Nagarjunasagar Three Colour Lights : మువ్వన్నెల్లో మురిసిపోతున్న నాగార్జునసాగర్‌..జాతీయ జెండాను తలపించేలా కృష్ణమ్మ పరవళ్లు

పోస్ట్ కోవిడ్‌ తర్వాత వరుసగా మూడో ఏడాది ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎర్రకోటపై ప్రధానమంత్రి హోదాలో తొమ్మిదోసారి జాతీయ జెండాను మోదీ ఎగురవేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కరోనా నిబంధనలను పాటించేలా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీక్షకులు భౌతిక దూరం పాటించేలా సీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోటలోని పరిసరాలు బయటకు కనిపించకుండా, ఇతర వ్యక్తులు లోపలికి రాకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎర్రకోట చుట్టూ ఉన్న మొత్తం ఎనిమిది మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటలవరకు సెంట్రల్ ఢిల్లీలో ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఢిల్లీలో పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్​బెలూన్, రిమోట్ పైలట్ ఎయిర్​క్రాఫ్ట్‌లపై ఆగస్టు 16 వరకు నిషేధం విధించారు. వందేళ్ళ స్వాతంత్ర్య భారత లక్ష్యాలు, ఆత్మ నిర్భర భారత్, దేశ అభివృద్ధి, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, రైల్వేలు, ఇధనం, క్రీడలు, సంక్షేమ పథకాలు, నూతన ఆవిష్కరణ వంటి అంశాలపై సోమవారం జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రధాని సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు