Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తున్న రిషి సునక్.. నాలుగో రౌండ్లో ముందంజ

బ్రిటన్ నూతన ప్రధాని ఎంపిక కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకెళ్తున్నారు. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించారు. మొదటి స్థానంలో నిలిచారు.

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో భారత మూలాలున్న రిషి సునక్ దూసుకెళ్తున్నారు. బోరిస్ జాన్సన్ తర్వాత కన్జర్వేటివ్ పార్టీ తరఫున బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ ఓటింగ్‌లో 118 ఓట్లు సాధించి రిషి సునక్ ముందంజలో నిలిచారు. ఆయన 120 ఓట్లు సాధించాల్సి ఉంది.

Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

ఇంతకుముందు మూడో రౌండ్లో ఆయన 115 ఓట్లు సాధించారు. రిషి సునక్ తర్వాతి స్థానాల్లో ట్రేడ్ మినిష్టర్‌గా ఉన్న పెన్నీ మోర్డాంట్ 92 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, విదేశీ కార్యదర్శి లిజ్ ట్రస్ 86 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ పదవి కోసం రిషి సునక్‌తో కలిపి ముగ్గురు పోటీ పడుతున్నారు. బుధవారం ముగ్గురికీ కలిపి ఫైనల్ రౌండ్ ఓటింగ్ జరుగుతుంది. ఇందులో మెజారిటీ సాధించిన వారు కన్జర్వేటివ్ పార్టీ తరఫున ప్రధాని పదవికి అర్హత సాధిస్తారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం పదవి కోసం పోటీపడే ఇద్దరిలో ఒకరిగా రిషి సునక్ ఉంటారు.

Armed Forces: ఐదేళ్లలో 819 మంది సైనికుల ఆత్మహత్య: కేంద్రం

అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తి కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించడంతోపాటు, బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 5న ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. రిషి సునక్ ప్రధానిగా ఎన్నికైతే ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగానే కాకుడా, తొలి ఆసియన్‌గా కూడా నిలుస్తారు.

ట్రెండింగ్ వార్తలు