Ganga River : ‘కుళ్లిన కరోనా మృత దేహాలతో గంగానది డంపింగ్ యార్డ్ అయింది’

గంగానదిలో వందల మృతదేహాలు కొట్టుకొచ్చాయని..కుళ్లిన కరోనా మృతదేహాలతో గంగానదిని డంపింగ్ యార్డ్ గా చేశారని.. జాతీయపథకం డైరెక్టర్‌ జనరల్‌,‘క్లీన్ గంగ’ పుసక్త రచయిత రంజన్‌ మిశ్రా అన్నారు

Covid Dead Bodies In Ganga River

Ganga River : గంగానది.. హిందువులకుఅత్యంత ప్రవిత్రమైన ఈ నదిలో వందలాది మృతదేహాలు కొట్టుకొచ్చిన అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణానికి కారణం కూడా కరోనా మహమ్మారే కావటం గమనించాల్సిన విషయం. కరోనా సెకండ్ వేవ్ లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో లెక్కేలేదు. ఆగని రావణ కాష్టంలా కరోనాతో చనిపోయినవారి మృదేహాల దహన సంస్కారాలే సాక్షిగా నిలిచాయి.

అటువంటి దారుణ పరిస్థితుల్లో గంగానదితో పాటు దాని ఉపనదుల్లో 300కు పైగా సగం కాలిన శవాలు, కుళ్లిన మృతదేహాలు కొట్టుకొచ్చాయని ‘క్లీన్‌ గంగ’ జాతీయ పథకం డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా వెల్లడించారు. అత్యంత పవిత్రమైన నదిగా భావించే గంగానది.. మృతదేహాల డంపింగ్‌ యార్డుగా మారిందంటూ రాజీవ్ రంజన్ ‘గంగ’ అనే పుస్తకాన్ని రాశారు. దీనిని గురువారం (డిసెంబర్ 23, 2021) ప్రధాని ఆర్థిక కౌన్సిల్‌ సలహాదారులు బిబేక్‌ దెబ్రాయ్‌ ఆవిష్కరించారు. ‘‘ కరోనా సెకెండ్‌ వేవ్‌ సమయంలో దేశంలో బాధితులకు సరిపడా బెడ్లు లేవు. కనీసం ఆక్సిజన్‌ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగింది” అని రంజన్‌ మిశ్రా తెలిపారు.

Read more : Hyderabad CP CV Anand : హైదరాబాద్ సిటీ కొత్త పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్..

ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో వైరస్‌తో చనిపోయిన వారిని ఏం చేయాలో తెలియక.. రోజు రోజుకు పెరుగుతున్న మరణాలతో మృతదేహాలను ఏం చేయాలో (దహనసంస్కారాలకు స్థలం కూడా లేని పరిస్థితి) పాలుపోక జిల్లా పాలనా యంత్రాంగం.. శవాలను గంగానదిలో పారవేసిందని.. మృతదేహాలను డంపింగ్‌ చేయటానికి గంగానదిని ఎంచుకుందని రాజీవ్ రంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మృతదేహాలను ఖననం చేయడంపై అవగాహన లేక కొందరు.. అంత్యక్రియలకు డబ్బుల్లేక మరికొందరు.. ఇలా పలు కారణాలతో కరోనా మృతదేహాలను గంగానదిలో పడేశారని అన్నారు. అంత్యక్రియల నిర్వహణ సరిగా లేకపోవడం, మృతదేహాలను దహనం చేయకుండా నదిలో పడేయడం గురించి తెలియజేయటానికే ఈ ‘‘క్లీన్‌ గంగ’’అనే పుస్తకాన్ని రాశానని రచయిత వెల్లడించారు.

Read more : Covid-19 : భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నాలుగు వారాలుగా 10 వేలకు పైగా నమోదు

మిశ్రా 1987-బ్యాచ్ తెలంగాణ-క్యాడర్ IAS అధికారి. NMCGకి వివిధ హోదాల్లో ఐదేళ్లపాటు సేవలందించిన వ్యక్తి. ఆయన 2021 డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు.