Covid-19 : భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నాలుగు వారాలుగా 10 వేలకు పైగా నమోదు

భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సెకండ్ వేవ్‌ తర్వాత తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 6.1శాతం పాజిటివిటి రేట్ ఉంది.

Covid-19 : భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నాలుగు వారాలుగా 10 వేలకు పైగా నమోదు

Covid (2)

Covid-19 cases on the rise in India : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌తో మరోసారి కలవరం మొదలైంది. ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ విధించాయి. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా ఫోర్త్ వేవ్‌ నడుస్తోందని…కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా మన దేశంలో వైరస్ విజృంభణతో కీలక ఆదేశాలు జారీ చేసింది.

మన దేశంలో క్రమంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సెకండ్ వేవ్‌ తర్వాత తగ్గుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు…మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 6.1 శాతం పాజిటివిటి రేట్ ఉంది. మిజోరంలో 8.2 శాతం ఉంది. ఇది జాతీయంగా పాజిటివిటి రేటు కన్నా ఎక్కువగా ఉందని కేంద్రం వెల్లడించింది. ఇక రోజు వారి కేసుల్లో పెరుగుదలతో 7 వేలకు పైగా నమోదవుతున్నాయి.

Omicron Effect : క్రిస్మస్ సంబరాలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్..ప్రపంచవ్యాప్తంగా 3,500లకు పైగా ఫ్లైట్స్ రద్దు

నాలుగు వారాలుగా భారత్‌లో పది వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. అయితే ప్రస్తుతం ప్రపంచంలో కరోనా నాలుగో వేవ్‌ ఉధృతి కనిపిస్తోందని, ఈ సమయంలో మన దేశంలో కోవిడ్‌ నిబంధనలను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా 6.1 శాతం పాజిటివి రేట్ నమోదవుతున్నట్టు కేంద్రం తెలిపింది.

టీకాలు తీసుకోవడం, కోవిడ్‌ నిభందనలు పాటించాలని కేంద్రం సూచించింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఇప్పటికీ ఇండియాలో డెల్టానే డామినెంట్‌ వేరియంట్‌ అని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ భార్గవ తెలిపారు. అయితే పాజిటివిటి రేటు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో RTPCR టెస్టులు సరిగా చేయడం లేదన్నారు. టెస్టుల సంఖ్య పెంచాలన్నారు.

Fire Broke Out : విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

ఇక ప్రైవేట్‌ వైద్య రంగం తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. కరోనాపై పోరుకు 18 లక్షల ఐసోలేషన్‌ బెడ్స్, 5 లక్షల ఆక్సీజన్‌ సపోర్టెడ్‌ బెడ్స్, 1.39 లక్షల ఐసీయూ బెడ్స్‌ సిద్ధంగా ఉంచారు. ఎమర్జెన్సీ కోవిడ్‌ రెస్పాన్స్‌ ప్యాకేజ్‌2లో భాగంగా 50 శాతం నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించామన్నారు.