Omicron Effect : క్రిస్మస్ సంబరాలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్..ప్రపంచవ్యాప్తంగా 3,500లకు పైగా ఫ్లైట్స్ రద్దు

ప్రపంచవ్యాప్తంగా 3,500లకు పైగా ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లలేకపోయారు. యూకే, ఫ్రాన్స్, ఇటలీ, యూఎస్‌లో కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవాణా స్తంభించింది.

Omicron Effect : క్రిస్మస్ సంబరాలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్..ప్రపంచవ్యాప్తంగా 3,500లకు పైగా ఫ్లైట్స్ రద్దు

Visakha (1)

Omicron effect on Christmas festivities : ఒమిక్రాన్ వైరస్ పండగలను కూడా మింగేస్తోంది. ప్రజలకు సంతోషం లేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రిస్టియన్లు క్రిస్మస్ సంబరాలు కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. అమెరికా నుంచి యూరోప్ వరకు అన్ని దేశాల్లో ఒమిక్రాన్ ఆంక్షలను విధించడంతో ఆ ప్రభావం క్రిస్మస్ సంబరాలపై పడింది.

ప్రపంచవ్యాప్తంగా 3వేల 500లకు పైగా ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లలేకపోయారు. యూకే, ఫ్రాన్స్, ఇటలీ, యూఎస్‌లో కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవాణా స్తంభించిపోయింది. ముందు జాగ్రత్తగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఒక్క అమెరికాలోనే దాదాపు 500 వరకు విమానాలను రద్దు చేశారు.

Christmas : దేశవ్యాప్తంగా క్రిస్‌మస్‌ సంబరాలు

‘మీరు ప్రయాణించాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి’ అంటూ చివరి నిమిషయంలో ప్రయాణికులకు సమాచారం అందడంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయారు. అమెరికాలో కొత్తగా వెలుగుచూస్తున్న కోవిడ్ కేసుల్లో 70 శాతానికి పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉండటంతో బైడెన్ ప్రభుత్వం… కోవిడ్ మొదటి వేవ్ తరహాలో ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాలపై బ్యాన్ విధించింది.

దీంతో అమెరికాలో వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణించాలనుకున్న వాళ్లు.. అమెరికా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వాళ్లు… అమెరికాకు ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్లు…ఆగిపోయారు. క్రిస్మస్ సందర్భంగా హాలిడేస్ ను ఎంజాయ్ చేద్దామనుకున్న వాళ్లకు ఒమిక్రాన్ శాపంగా మారింది.