Goa Congress
Goa Congress: గోవా అసెంబ్లీకి సంబంధించి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం స్పందించింది. బీజేపీలో చేరితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.40 కోట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధమైనట్లు ఆరోపించారు గోవా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గిరీష్ చోదంకర్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు.
Assam: మహిళ హత్య.. నిందితుడిని కాల్చి చంపిన గ్రామస్తులు
‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొందరు పారిశ్రామిక వేత్తలు, బొగ్గు మాఫియా నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. బీజేపీలో చేరితే రూ.40 కోట్లు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండు రావుకు చెప్పారు’’ అని గిరీష్ వెల్లడించారు. గోవాలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దీంతో వారంతా బీజేపీతో టచ్‌లో ఉన్నారని, బీజేపీలో చేరిపోతారని ప్రచారం మొదలైంది. అయితే, ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మైకేల్ లోబో బీజేపీపై ఆరోపణలు చేశారు. తమ పార్టీలో సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
INS Vikrant: ఆగష్టులో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభం.. చైనాకు ధీటుగా నిలవనున్న నౌక
ప్రస్తుతం గోవా అసెంబ్లీలో 20 సీట్లున్న బీజేపీ మరో ఐదుగురు ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల బీజేపీ గోవా అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ ఏడాది చివరికల్లా తమ ఎమ్మెల్యేల సంఖ్య 30కి చేరుతుందని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోతారని ప్రచారం మొదలైంది. 2019లో గోవాలో కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 10 మంది బీజేపీలో చేరిపోయి, పార్టీని విలీనం చేశారు. దీంతో వారంతా బీజేపీ ఎమ్మెల్యేలు అయిపోయారు.