INS Vikrant: ఆగష్టులో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభం.. చైనాకు ధీటుగా నిలవనున్న నౌక

ఇది మన దేశం తయారు చేసిన పూర్తి తొలి స్వదేశీ నౌక. ఇప్పటికే ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే మరో యుద్ధ విమాన వాహక నౌక ఉంది. ఇప్పటివరకు ఇలా సొంతంగా విమాన వాహక నౌకలు నిర్మించగలిగే సత్తా అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీలకు మాత్రమే ఉంది.

INS Vikrant: ఆగష్టులో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభం.. చైనాకు ధీటుగా నిలవనున్న నౌక

Ins Vikrant

Updated On : July 10, 2022 / 7:46 PM IST

INS Vikrant: ఇండియన్ నేవీ మరింత శక్తివంతం కానుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఆగష్టులో ప్రారంభం కానుంది. ఈ నౌక అందుబాటులోకి వస్తే చైనాకు భారత్ ధీటైన జవాబు ఇవ్వగలదని నిపుణుల అంచనా. ఈ వాహక నౌకకు సంబంధించి ఇప్పటివరకు నిర్వహించిన నాలుగు దశల పరీక్షలు విజయవంతమయ్యాయి. ఆదివారం జరిపిన చివరి దశ పరీక్ష విజయవంతమైంది. ఈ ఏడాది ఆగష్టు 15న ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ నేవీలో చేరుతుంది.

IndiGo: జీతాల పెంపు కోసం నిరసన.. సిక్ లీవులో ఇండిగో సిబ్బంది

ఇది మన దేశం తయారు చేసిన పూర్తి తొలి స్వదేశీ నౌక. ఇప్పటికే ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే మరో యుద్ధ విమాన వాహక నౌక ఉంది. ఇప్పటివరకు ఇలా సొంతంగా విమాన వాహక నౌకలు నిర్మించగలిగే సత్తా అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇండియా కూడా ఆ దేశాల సరసన చేరడం విశేషం. ఇండియా సొంతం చేసుకున్న తొలి విమాన వాహక నౌక విక్రాంత్.. 1961లో బ్రిటన్ నుంచి భారత్ దీన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే పేరుతో కొత్త నౌకను తయారు చేశారు. సముద్ర జలాల్లో గట్టి నిఘా, భద్రత కోసం ఈ నౌక ఉపయోగపడుతుంది. ఫ్లోటింగ్ ఎయిర్ బేస్‌గా పిలిచే ఈ నౌకపై 30 వరకు విమానాలు, హెలికాప్టర్లను ఆపరేట్ చేయొచ్చు.

Sri Lanka: శ్రీలంకకు అండగా ఉంటాం: భారత్

ఈ నౌక 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు ఉంటుంది. సముద్ర తలానికి 30 మీటర్ల లోతులో ఉంటుంది. 14 డెక్స్ ఉంటాయి. 2,300 కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి. 1,700 మంది సిబ్బంది పని చేయవచ్చు. 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక్కసారి ఇంధనం నింపుకొంటే 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. అంటే భారత సముద్ర తీరం మొత్తాన్ని రెండుసార్లు చుట్టేయగలదు. దీని నిర్మాణం 2006లో ప్రారంభమైంది. ఈ నౌకలో 18 అంతస్తుల బిల్డింగ్ ఉంది.