Rythu Bandhu: 28 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు

వర్షాకాలం పంట పెట్టుబడి కింద రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Rythu Bandhu: రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు పంట సాయం కింద నిధులను విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించనుంది. వర్షాకాలం పంట పెట్టుబడి కింద రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగే వరుస క్రమంలో రైతుబంధు సాయం కింద నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Uddhav Thackeray: అవసరమైతే రాజీనామాకు సిద్దం: ఉద్ధవ్ థాక్రే

సీఎం నుంచి ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిపారు. మరోవైపు వ్యవసాయ సమస్యలపై రైతులు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాలకు సంబంధించిన ఏ వివరాల కోసమైనా కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవచ్చని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు