Uddhav Thackeray: అవసరమైతే రాజీనామాకు సిద్దం: ఉద్ధవ్ థాక్రే

నా రాజీనామాను సిద్ధంగా ఉంచుతున్నాను. కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, రాజీనామా తీసుకుని గవర్నర్‌కు ఇవ్వొచ్చు. వాళ్లు నా ఎదురుగా వచ్చి రాజీనామా చేయాలి అని ఎందుకు అడగరు? నేను సీఎంగా ఉండకూడదని కాంగ్రెస్ లేదా ఎన్సీపీ అడగటం లేదు.

Uddhav Thackeray: అవసరమైతే రాజీనామాకు సిద్దం: ఉద్ధవ్ థాక్రే

Uddhav Thackeray

Uddhav Thackeray: తిరుగుబాటు చేసిన ఏ ఎమ్మెల్యే అయినా తన ముందుకొచ్చి రాజీనామా చేయమంటే.. వెంటనే రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం గురించి ఆయన బుధవారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడారు. ఎక్కడో ఉన్న ఎమ్మెల్యేలు తన ముందుకొచ్చి, రాజీనామా చేయాలి అని ఎందుకు ప్రశ్నించరు అని ఉద్ధవ్ నిలదీశారు.

MVA crisis: ముగిసిన మహా క్యాబినెట్ మీటింగ్.. అసెంబ్లీ రద్దుపై తేల్చని సీఎం

‘‘నా రాజీనామాను సిద్ధంగా ఉంచుతున్నాను. కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, రాజీనామా తీసుకుని గవర్నర్‌కు ఇవ్వొచ్చు. వాళ్లు నా ఎదురుగా వచ్చి రాజీనామా చేయాలి అని ఎందుకు అడగరు? నేను సీఎంగా ఉండకూడదని కాంగ్రెస్ లేదా ఎన్సీపీ అడగటం లేదు. సోనియా గాంధీ, శరద్ పవార్ నా మీద నమ్మకం ఉంచారు. నేను బాలా సాహెబ్ (బాల్ థాక్రే) కొడుకును. ఆయన నాకు ఇచ్చిన బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నాను. అదీ నాకు ఎలాంటి అనుభవం లేకుండానే. అయినా, ఇదేం ప్రజాస్వామ్యం. గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా కూడా ఎమ్మెల్యేలను ఇలాగే బంధించారు. 2014లో మేం ఒంటరిగానే పోరాడాం. మేం హిందూత్వను వదిలిపెట్టేది లేదు. అదే మాకు బాలా సాహెబ్ నేర్పిన మంత్రం. శివ సైనికులకు చెప్పేదొకటే.

Rahul Gandhi: ‘అగ్నిపథ్’ను కేంద్రం వెనక్కు తీసుకోవాలి: రాహుల్ గాంధీ

నేను పార్టీని, రాష్ట్రాని నడిపించడానికి అర్హుడిని కాదనుకుంటే ఆ మాట నా ఎదురుగా వచ్చి చెప్పండి. అలా చేస్తే పార్టీ నాయకత్వాన్ని వీడేందుకు సిద్ధం. కానీ, ముందు నాతో మాట్లాడండి. నేను అవసరం లేదని చెబితే వెంటనే బాధ్యతల్ని వదిలేస్తాను. ఎంత మంది ఎమ్మెల్యేలు చెబుతున్నారన్నది కూడా చూడను. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే చెప్పినా నేను పదవిని వదిలేస్తాను. నేనేమీ డ్రామాలు ఆడటం లేదు’’ అని ఉద్ధవ్ థాక్రే తన ప్రసంగంలో పేర్కొన్నారు.