MVA crisis: ముగిసిన మహా క్యాబినెట్ మీటింగ్.. అసెంబ్లీ రద్దుపై తేల్చని సీఎం

తిరుగుబాటు చేసిన నేతలంతా తిరిగి పార్టీలోకి వస్తారన్న నమ్మకాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అవసరమైతే శివసేనకు పూర్తిస్థాయి మద్దతు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అన్నారు. ఆయన ఏఐసీసీ ప్రతినిధిగా ఉన్న సంగతి తెలిసిందే.

MVA crisis: ముగిసిన మహా క్యాబినెట్ మీటింగ్.. అసెంబ్లీ రద్దుపై తేల్చని సీఎం

Mva Crisis

MVA crisis: రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన మహారాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. కోవిడ్ కారణంగా సీఎం ఉద్ధవ్ థాక్రే వర్చువల్‌గా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి 8 మంది మంత్రులు హాజరుకాలేదు. వీరంతా తిరుగుబాటు నేతల గ్రూపులో ఉన్నారా అనే దానిపై స్పష్టత లేదు. సమావేశంలో అసెంబ్లీ రద్దు ప్రతిపాదన ఏదీ రాలేదని సమాచారం. శివాజీ పుట్టిన నేలపై ఆయనకు శివసేన పార్టీ కళంకం తీసుకురాదని క్యాబినెట్ సమావేశానికి హాజరైన మంత్రులు అభిప్రాయపడ్డారు.

Telugu Film Industry Strike: ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల సమావేశం.. షూటింగ్ ఆపేదే లేదు!

తిరుగుబాటు చేసిన నేతలంతా తిరిగి పార్టీలోకి వస్తారన్న నమ్మకాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అవసరమైతే శివసేనకు పూర్తిస్థాయి మద్దతు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అన్నారు. ఆయన ఏఐసీసీ ప్రతినిధిగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు తిరుగుబాటు నేతలంతా షిండే ఆధ్వర్యంలో అసో్ంలోని గువహటి చేరుకున్నారు. ఆయన వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే అంశంపై స్పష్టత లేదు. షిండే క్యాంపు నుంచి ఒక శివసేన ఎమ్మెల్యే తప్పించుకుని బయటకు వచ్చాడు. ఒస్మానాబాద్ నుంచి గెలిచిన కైలాస్ పాటిల్ అనే ఎమ్మెల్యే క్యాంపు నుంచి బయటికొచ్చి, షిండేపై ఆరోపణలు చేశాడు. ఏక్ నాథ్ షిండేకు చెందిన వ్యక్తులు తనను బలవంతంగా ఎత్తుకెళ్లారని, కారులో గుజరాత్ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా తప్పించుకుని వచ్చానని కైలాస్ చెప్పాడు. కాగా, తాజా క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వ రద్దు గురించి చర్చించకపోయినప్పటికీ, ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ మాత్రం దీని గురించి స్పందించారు.

polluted air: కలుషిత గాలిని పీల్చితే నాడీ సంబంధిత వ్యాధులు.. ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

అసెంబ్లీ రద్దు అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సీఎం రాజీనామాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. మరోవైపు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పించడంపై శివసేన పార్టీ ఎమ్మెల్యేలు అసోం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఒక పక్క రాష్ట్రంలో వరదలు తీవ్ర ప్రభావం చూపుతూ ప్రజలు కష్టాలు పడుతూ ఉంటే, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఫైవ్ స్టార్ హోటల్ సదుపాయం కల్పిస్తారా అంటూ విమర్శించారు.