Samantha : లైఫ్‌లో ముందుకెళ్లలేనేమో అనిపించింది.. ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సమంత..

ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన వ్యాధి గురించి పలు విషయాలని తెలిపింది. అలాగే తన ప్రస్తుత పరిస్థితి గురించి కూడా చెప్పి ఎమోషనల్ అయి ఏడ్చేసింది సమంత.............

Samantha cried in interview

Samantha : చైతూతో విడాకుల తర్వాత సమంత పుష్పలో ఐటెం సాంగ్ మాత్రమే చేసింది ఇప్పటివరకు. తన నుంచి ఫుల్ లెంగ్త్ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత సమంత యశోద అనే లేడీ ఓరియెంటెడ్ ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతుంది. తమిళ డైరెక్టర్స్ హరి-హరీష్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు. యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 11న విడుదల కానుంది.

ఇటీవల కొన్ని రోజుల క్రితం సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు, చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సమంత బయటకి వచ్చి సినిమా ప్రమోషన్స్ చేస్తుందా అనుకున్నారు. కానీ ఎట్టకేలకు సమంత బయటకి వచ్చి యశోద సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత యాంకర్ సుమకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.

Samantha : చాలా కలలతో సినీ పరిశ్రమకి వచ్చాను.. ప్రస్తుతం చాలా డిఫికల్ట్ పొజిషన్‌లో ఉన్నాను..

ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన వ్యాధి గురించి పలు విషయాలని తెలిపింది. అలాగే తన ప్రస్తుత పరిస్థితి గురించి కూడా చెప్పి ఎమోషనల్ అయి ఏడ్చేసింది సమంత. ”లైఫ్ లో కొన్ని మంచి రోజులు, కొన్ని బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. ఒకానొక స్టేజిలో లైఫ్ లో ముందుకెళ్లలేనేమో అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఇంతదాకా వచ్చానా అనిపిస్తుంది. ప్రస్తుతం చచ్చిపోయే స్టేజిలో అయితే లేను. కొంచెం సివియర్ గా ఉంది, చికిత్స తీసుకుంటున్నాను. త్వరలో మరింత ఆరోగ్యంగా వస్తాను” అని చెప్తూ ఏడ్చేసింది.

సమంత అలా ఇంటర్వ్యూలో ఏడవడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. సమంత అభిమానులు, నెటిజన్లు నీకు మేమంతా సపోర్ట్ ఉన్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.