Samantha : చాలా కలలతో సినీ పరిశ్రమకి వచ్చాను.. ప్రస్తుతం చాలా డిఫికల్ట్ పొజిషన్‌లో ఉన్నాను..

సమంత ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన వ్యాధి గురించి పలు విషయాలని తెలిపింది. సినిమాలో క్యారెక్టర్ ని, తన గురించి పోల్చుకుంటూ కొన్ని విషయాలని తెలిపింది............

Samantha : చాలా కలలతో సినీ పరిశ్రమకి వచ్చాను.. ప్రస్తుతం చాలా డిఫికల్ట్ పొజిషన్‌లో ఉన్నాను..

Samantha talks about her current position in life

Updated On : November 8, 2022 / 10:45 AM IST

Samantha :  విడాకుల తర్వాత పుష్పలో ఐటెం సాంగ్ చేసినా, చాలా గ్యాప్ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతుంది. అందులోనూ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది సామ్. తమిళ డైరెక్టర్స్ హరి-హరీష్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు. యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 11న విడుదల కానుంది.

ఇటీవల కొన్ని రోజుల క్రితం సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు, చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సమంత బయటకి వచ్చి సినిమా ప్రమోషన్స్ చేస్తుందా అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో సమంత ప్రమోషన్స్ మొదలుపెట్టింది. యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత యాంకర్ సుమకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.

Samantha : రోప్స్, డూప్స్ లేకుండా ఫైట్స్ చేశాను.. చాలా దెబ్బలు తగిలాయి..

ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన వ్యాధి గురించి పలు విషయాలని తెలిపింది. సినిమాలో క్యారెక్టర్ ని, తన గురించి పోల్చుకుంటూ కొన్ని విషయాలని తెలిపింది. ”సినిమాలో యశోద క్యారెక్టర్ కూడా లైఫ్ మీద చాలా కలలతో ఉంటుంది. నేను కూడా చాలా కలలతో సినీ పరిశ్రమకి వచ్చాను. నేను ప్రస్తుతం చాలా డిఫికల్ట్ పొజిషన్ లో ఉన్నాను. వాటినుంచి త్వరగా బయటపడతాను అనుకుంటున్నాను. నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు, సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేయడంతో ఆ పరిస్థితుల్లోనే డబ్బింగ్ చెప్పాను. యశోద క్యారెక్టర్ లాగే నాకు కూడా పట్టుదల, మొడితనం ఎక్కువ. అందుకే అలాంటి పరిస్థితుల్లో కూడా డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయి తమిళ్, తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను” అని తెలిపింది సమంత.