Samantha : రోప్స్, డూప్స్ లేకుండా ఫైట్స్ చేశాను.. చాలా దెబ్బలు తగిలాయి..
యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత యాంకర్ సుమకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన వ్యాధి గురించి పలు విషయాలని తెలిపింది. యశోద సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి సమంత మాట్లాడుతూ.............

Samantha shares about action sequence experience in Yashoda movie
Samantha : చాలా గ్యాప్ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతుంది. అదికూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా. డైరెక్టర్స్ హరి హరీష్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో యశోద సినిమా తెరకెక్కింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు. యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 11న విడుదల కానుంది.
అయితే ఇటీవల సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు, చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. చైతూతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఎక్కువగా బయటకి రాని సమంత ఇప్పుడు యశోద సినిమా ప్రమోషన్స్ కి అయినా వస్తుందా అనే సందేహం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో సమంత ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
Ashwini Puneeth Rajkumar : ఇది పునీత్ కోరిక అంటూ.. కన్నడ ప్రజలకు పునీత్ రాజ్‌కుమార్ భార్య లేఖ..
యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత యాంకర్ సుమకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన వ్యాధి గురించి పలు విషయాలని తెలిపింది. యశోద సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి సమంత మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. చాలా వరకు రోప్స్, డూప్స్ లేకుండా ఫైట్స్ చేశాను. దెబ్బలు కూడా బాగా తగిలాయి. ఒకసారి అయితే ఫేస్ వాచిపోయింది, అరగంట వరకు కదలలేదు. క్లైమాక్స్ లో ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఫైట్స్ కోసం చాలా కష్టపడ్డాను. ఫైట్ మాస్టర్స్ కూడా అద్భుతంగా ఫైట్స్ ని డిజైన్ చేసారు” అని తెలిపింది. సమంత యాక్షన్ సీన్స్ ఫుల్ గా ఉన్నాయి అని చెప్పడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.