Samantha Father shares chaisam reception photos and post emotionally
Samantha Father : సమంత, నాగ చైతన్యలు విడిపోయి రోజులు గడుస్తున్నా రోజూ ఏదో ఒకరకంగా వీరిద్దరి పేర్లు మీడియాలోనో, సోషల్ మీడియాలోనో వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ విడిపోయి తమ పనులు తాము చేసుకుంటున్నా వీరిపై వార్తలు, పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇలాటి వాటిని నాగ చైతన్య పట్టించుకోకుండా సైలెంట్ గా ఉన్నా సమంత మాత్రం అప్పుడప్పుడు తనపై వచ్చే వార్తలని ఖండిస్తోంది. తాజాగా మరోసారి వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Mega Block Buster : మెగా బ్లాక్ బస్టర్.. ఇది యాడ్ ప్రమోషనా.. మీషో ఒక్క యాడ్ కోసం ఇంతమంది స్టార్లా??
ఇందుకు కారణం సమంత తండ్రి జోసెఫ్ ప్రభు షర్ చేసిన పోస్ట్. తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు. సమంత రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి.. ‘‘చాలా కాలం క్రితం ఒక కథ ఉండేది. ఆ కథ ఇకపై ఉండదు. కొత్త కథను, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం” అనే కొటేషన్ ని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ని తన స్నేహితుడితో ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. దీంతో సమంత తండ్రి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.