PM Modis gifts for Macron
PM Modi’s gifts for Macron, French First Lady : ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గంధపు చెక్కతో తయారు చేసిన సంగీత వాయిద్యం సితార్, పోచంపల్లి ఇకత్ చీరను బహుమతిగా అందజేశారు. (Sandalwood sitar, Pochampally ikat) తన రెండు రోజుల పర్యటనలో ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోదీ ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ ల మధ్య బహుమతుల మార్పిడి జరిగింది.
PM Modi visit : ముగిసిన ఫ్రాన్స్ పర్యటన..అబుదాబీకి వచ్చిన మోదీ
ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్, ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యెల్లె బ్రౌన్ పివెట్ లకు స్వదేశీ హస్తకళతో తయారు చేసిన బహుమతులను మోదీ ప్రదానం చేశారు. శుక్రవారం ప్యారిస్‌లో ప్రధాని మోదీ, మాక్రాన్ మధ్య జరిగిన బహుమతుల పంపిణీ జరిగింది. ప్రధాని మోదీ కాశ్మీరీ కార్పెట్‌ను మాక్రాన్ కు బహుకరించారు.
Ranjit Singh became Saddam Sheikh : అల్ ఖైదాలో చేరిన రంజిత్ సింగ్ సద్దాం షేక్‌గా మారినవేళ…
ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన పట్టు కాశ్మీరీ కార్పెట్ బహుమతిగా ఇచ్చారు. ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు అంబారీని మోదీ బహూకరించారు. మాక్రాన్ కు బహుమతిగా సరస్వతి విగ్రహాలు ఇచ్చారు. సంగీత వాయిద్యం యొక్క ప్రత్యేక ప్రతిరూపం స్వచ్ఛమైన చందనంతో తయారు చేశారు.
Heavy rainfall alert : పలు ప్రాంతాల్లో భారీవర్షాలు…108 మంది మృతి
చందనం పెట్టెలో పోచంపల్లి పట్టు ఇకత్ చీరను ఫ్రెంచ్ ప్రథమ మహిళకు ప్రధాని మోదీ బహుమతిగా అందజేశారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రికి పాలరాతి కళాఖండాన్ని బహూకరించారు. 20 వ శతాబ్ధంలో ఫ్రెంచ్ సాహిత్యంలోని ముఖ్యమైన నవలను మాక్రాన్ మోదీకి బహుమతిగా ఇచ్చారు.