Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశేనా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను వేసవి ట్రీట్‌గా ప్రేక్షకులకు అందించేందుకు.....
- Anil Aaleti
- Published On : April 4, 2022 / 12:36 PM IST
Sarkaru Vaari Paata Release Pushed To May End
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను వేసవి ట్రీట్‌గా ప్రేక్షకులకు అందించేందుకు మహేష్ అండ్ టీమ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో సోషల్ మీడియాలో ఓ వార్త మహేష్ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఈ సినిమాను వేవసి కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
Sarkaru Vaari Paata: అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన థమన్!
కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ మరోసారి తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. వారు అనుకున్న దానకింటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుండటంతో.. సర్కారు వారి పాట చిత్రాన్న మే 12న రిలీజ్ చేయడం కుదరకపోవచ్చని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీంతో ఈ సినిమాను మే నెలాఖరున రిలీజ్ చేయాలని.. అప్పుటివరకు ఎలాంటి పనులు పెండింగ్‌లో ఉండవని వారు భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త జోరుగా షికారు చేస్తోంది.
Sarkaru Vaari Paata: పెన్నీ సాంగ్.. మహేష్ క్రేజ్‌కు మరో మచ్చుతునక!
అయితే ఇదంతా కేవలం ట్రాష్ అని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో డేట్స్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అసలే తమ అభిమాన హీరో సినిమా వచ్చి చాలా కాలం అవుతుండటంతో, ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ సర్కారు వారి పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి నిజంగానే ఈ సినిమాను మే నెలాఖరుకు వాయిదా వేస్తారా అనేది తెలియాలంటే మాత్రం మహేష్ అండ్ టీమ్ నుండి ఓ అఫీషియల్ స్టేట్‌మెంట్ రావాల్సిందే. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
