Security Guard sings amazingly : ఆఫీస్‌కి కాపలా కాస్తూనే అద్భుతంగా పాటలు పాడేస్తున్న సెక్యూరిటీ గార్డ్.. ఎక్కడంటే?

కొందరు పొట్టకూటికోసం రకరకాల పనులు చేస్తుంటారు. కానీ వారిలో నిగూఢంగా వేరే ప్రతిభ దాగి ఉంటుంది. అది బయటపెట్టుకునే అవకాశం చాలామందికి రాదు. ముంబయిలో ఓ సెక్యూరిటీ గార్డు ఆఫీస్‌కి కాపలా కాస్తూనే.. అద్భుతంగా పాటలు పాడేస్తున్నాడు.

Security Guard sings amazingly

Security Guard sings amazingly :  సెక్యూరిటీ గార్డ్‌లు తాము పనిచేసే ఆఫీసులకు నిరంతరం కాపలా కాస్తుంటారు.. విధులు నిర్వర్తించడమే కాదు వారిలో కూడా అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుందని చాటుకున్నాడు ముంబయికి చెందిన ఓ సెక్యూరిటీ గార్డు. తాను పనిచేసే కార్యాలయం బయట మైక్‌లో పాటలు పాడుతూ కనిపించాడు.

Singing Ringing Tree : గాలి స్థాయిని బట్టి పాటలు పాడే చెట్టు

IMC ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దగ్గర ‘సాంజ్ ధాలే గగన్ తలే’ అనే అద్భుతమైన పాట వినిపిస్తోంది. అది పాడుతున్నది బయట విధులు నిర్వహించే సెక్యూరిటీ గార్డ్. అతను ఎంతో హృద్యంగా పాడుతుంటే బయట జనం ఆగిపోయి చూస్తున్నారు. ఈ వీడియోని దీపిక అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ‘ ఏ ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ గార్డులు తమ ప్రతిభను చాటుకునేందుకు బాస్‌లు అనుమతి ఇవ్వరు. కానీ ఈ సెక్యూరిటీ గార్డుకు అనుమతి ఇచ్చిన IMC కి ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

భయం పోయేందుకు పాటలు పాడారు..ఎక్సర్ సైజ్ చేశారు..చివరకు చావును ఎదిరించిన కార్మికులు

ఇంతకు ముందు బనారస్ ఘాట్ మీద ఓ వ్యక్తి కూర్చుని వయోలిన్‌పై ‘తుమ్ తక్’ అనే సాంగ్ వాయిస్తున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. యద్నేష్ రాయ్‌కర్ అనే కళాకారుడిగా గుర్తించబడిన అతను వయోలిన్‌పై ఎన్నో పాటలు అద్భుతంగా వాయించాడు. ‘తుమ్ తక్’ పాటకు మాత్రం ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల కాలంలో స్ట్రెస్ పోగొట్టుకునే క్రమంలో కూడా అనేకమంది తమలోని ప్రతిభా పాటవాలకు మెరుగులు దిద్దుతున్నారు. ఇలా పబ్లిక్‌లోకి వచ్చి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.