Singing Ringing Tree : గాలి స్థాయిని బట్టి పాటలు పాడే చెట్టు

అదొక అద్భుతమైన చెట్టు. గాలి వీచే విధానాన్ని బట్టి పాటలు పాడుతుంది. పిల్లగాలులు వీచేటప్పుడు మంద్రంగా, ఒకమోస్తరు గాలి వీస్తేఒకలా..శరవేగంగా పెనుగాలులు వీస్తే తారస్థాయిలోను పాడుతుంది.

Singing Ringing Tree : గాలి స్థాయిని బట్టి పాటలు పాడే చెట్టు

Singing Ringing Tree

Singing Ringing Tree : గాలి వీస్తే చెట్లు ఊగుతాయా? చెట్లు ఊగితే గాలి వస్తుందా? మీరడిగే ప్రశ్న చెట్టు ముందా?విత్తు ముందా? కోడి ముందా?గుడ్డు ముందా?అన్నట్లుగా ఉంది అని అంటారా?నిజమేలెండి. ఇవన్నీ ఎందుకులే గానీ..మనం ఓ అద్భుతమైన చెట్టు గురించి చెప్పుకుందాం. అదే పాటలు పాడే చెట్టు. ఏంటీ ఇది మరీ బాగుంది..చెట్లు ఎక్కడైనా పాటలు పాడతాయా? అని మళ్లీ అంటారు. కానీ ఇది నిజమేనండీ అన్నీ జోకులనుకుంటే ఎట్లా? కాకపోతే మీకొచ్చిన డౌటనుమానం ప్రకారం ఈ చెట్టు విషయంలో కాస్త మతలబు ఉండనే ఉంది. నిజమేలెండీ.. అయినా చెట్టేంటీ పాటేంటీ అని తెలుసుకోవాలని అయితే ఉంది కదూ..ఆ చెట్టు ‘వాయుగీతం’ ఆలపించే చెట్టు అన్నమాట. వాయు అంటే గాలి. గీతం అంటే పాట. కలిపితే వాయు గీతం చెట్టు. గాలి వీచే విధానాన్ని బట్టి ఈ చెట్టు వాయి గీతం వినిపిస్తుంది?

Read more : Viral Duck : ‘యూ బ్లడీ ఫూల్’ అని తిడుతున్న బాతు

ఇంగ్లండ్ లో లాంకషైర్‌ కౌంటీలోని బర్న్‌లీ పట్టణానికి చేరువలో కనిపించే ఈ చెట్టు రోజంతా వాయుగీతాలను వినిపిస్తుంది. నెమ్మదిగా పిల్లగాలులు వీచేటప్పుడు మంద్రంగా, గాలులు ఒకమోస్తరుగా వీచేటప్పుడు కాస్త మధ్యమంగా, శరవేగంగా పెనుగాలులు వీచేటప్పుడు తారస్థాయిలోను స్వరాలాపన చేసే ఈ వృక్షం అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే అర్థమం ఉంటుంది మీకు.. ఇది సహజమైన వృక్షం కాదు అని. నిజమే..ఉక్కుతో రూపొందించిన 10 అడుగుల లోహ కళాఖండం ఈ వాయిగీతం ఆలపించే చెట్లు. ఈ చెట్టు కొమ్మల్లా వివిధ పరిమాణాల్లో వేణువులాంటి లోహపు గొట్టాలను ఏర్పాటు చేయడంతో, ఈ గొట్టాల గుండా గాలి వెళ్లేటప్పుడల్లా చిత్రవిచిత్రమైన స్వరధ్వనులు వినిపిస్తాయి.

Read more : 1 Village,2 Languages : మహిళలు ఒక భాష..పురుషులు మరొక భాష మాట్లాడే వింత గ్రామం

మైక్‌ టాంకిన్, అన్నాలియు అనే లోహశిల్పులు ఈ లోహవృక్షాన్ని స్వరాలు పలికేలా తీర్చిదిద్దారు. బెర్న్‌లీ పట్టణానికి చేరువలోని ఖాళీ మైదానంలో ఈ వాయు గీతం చెట్టుని 2006లో ఏర్పాటు చేశారు. ఈ చెట్టుకు ‘ద సింగింగ్‌ రింగింగ్‌ ట్రీ’ అనే పేరు పెట్టారు. ఈ లోహవృక్ష రూపకల్పనలో కనపరచిన అమోఘ శిల్పనైపుణ్యానికి గుర్తింపుగా 2007లో దీనిని రూపొందించిన శిల్పులకు రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్స్‌ ఏటా ఇచ్చే జాతీయ అవార్డు కూడా లభించింది.

Read more : వామ్మో..బండబూతులు తిడుతున్న చిలుకలు..వినలేక చెవులు మూసుకుంటున్న జనాలు..!!