వామ్మో..బండబూతులు తిడుతున్న చిలుకలు..వినలేక చెవులు మూసుకుంటున్న జనాలు..!!

  • Published By: nagamani ,Published On : September 30, 2020 / 12:07 PM IST
వామ్మో..బండబూతులు తిడుతున్న చిలుకలు..వినలేక చెవులు మూసుకుంటున్న జనాలు..!!

parrots bad words:చిలుకమ్మలు పలికే ముద్దు ముద్దు పలుకులు వింటే అలా వింటుండాలనిపిస్తుంది. కానీ ఓ జూలో ఉండే చిలుకలు మాటలు వింటే మాత్రం చెవులు గట్టిగా మూసేసుకుంటాం. ఎందుకంటే అవి బండబూతులు మాట్లాడేస్తున్నాయి. జూకు వచ్చిన సందర్శకులు వాటి దగ్గరకొచ్చి అబ్బా..ఎంత ముద్దుగా ఉన్నాయో అని మురిసిపోతుంటే..పలకటం మొదలు పెట్టిన ఆ చిలుకలు వారిని తెగ తిట్టి పడేస్తున్నాయి. అలా ఇలా కాదు ఏకంగా బండ బూతులే తిడుతున్నాయట. ఆ బూతులు వినలేకి సందర్శకులు షాక్ అయి తరువాత చెవులు మూసుకుని మరీ అక్కడ నుంచి వెళ్లిపోతున్నారు.


వామ్మో…ఇవెక్కడి రౌడీ చిలుకలు..ఇలా బండ బూతులు మాట్లాడుతున్నాయని అక్కడ నుంచి వెళ్లిపోతున్నారు. లండన్‌లోని లింకన్ షైర్ జంతు ప్రదర్శన శాలలో ఈ బూతు చిలుకలు అక్కడికి వచ్చిన సందర్శకులను పట్టుకుని నోటికొచ్చినట్టు పచ్చి బూతులు తిట్టేస్తున్నాయట. ఆ మాటలు విని ఏంటి చిలకలే ఇలా మాట్లాడుతున్నాయని వారు నోరెళ్లబెడుతున్నారు. కాసేపు అలా అని ఊరుకుంటాయి కదాని అక్కడే నిలబడిన వారికి అవి బూతుల దండకం చదువుతుంటే వినడం భరించలేక చెవులు మూసుకుని పలాయనం చిత్తగిస్తున్నారట.


గత ఆగస్టు 15న లండన్‌లోని లింకన్ షైర్ జూకు అధికారులు ఐదు ఆఫ్రికన్ చిలుకలను తీసుకొచ్చారు. వాటిని సందర్శనకు ఉంచారు. చక్కగా సందర్శకులను అలరిస్తాయని అనుకున్నారు. కానీ అవి నోరు విప్పితే చాలా బూతులే బూతులు వెల్లువలా వచ్చేస్తున్నాయట. కానీ ఆ చిలుకలు బూతులు మాట్లాడటం నేర్చుకున్నాయో తెలీదు గానీ.. సందర్శకులను అమ్మనా బూతులు తిట్టేస్తున్నాయి.


అక్కడున్న జూ కీపర్లు, ఇతర సిబ్బందిని కూడా వదిలటం లేదు. ఇష్టమొచ్చినట్లుగా తిట్టి పోస్తున్నాయి. కానీ అవి తమను ఎంత తిట్టినా హాయిగా ఉందని కొందరు వాటి బూతులు విని తెగ నవ్వేసుకుంటున్నారట. చిలుకలు కదా మరి బూతులు తిట్టినా వినసొంపుగా ఉంటాయి మరి.


మరికొందరైతే వాటి బూతులు వినలేక జూ అధికారులకు ఫిర్యాదు చేయటంతో వారు వెంటనే ఆ చిలుకలను డిస్ ప్లే నుంచి తొలగించి సందర్శకులు రాని ప్రాంతంలో ఉంచారు. ఈ విషయమై పార్క్ సీఈఓ స్టీవ్ నికోలస్ మాట్లాడుతూ.. ‘వాటిలో ఒక చిలుకకు బూతులు వచ్చి ఉంటాయేమో..దానితో పాటు అన్నింటినీ కలిపి ఉంచడం వల్లే ఒకదాని నుంచి ఒకటి బూతులు నేర్చుకుని ఉంటాయని అన్నారు. సందర్శకులకు ఇబ్బంది కలిగేలా మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని నికోలస్ తెలిపారు. కానీ బూతులు నేర్చిన చిలుకలు మానతాయా? అనే డౌట్ వారికి కూడా ఉంది. దీంతో పార్క్ సీఈవో నికోలస్..ఆ చిలుకల్లో ఓ తుంటరి చిలుకను పట్టుకుని తప్పు అలా మాట్లాడకూడదు..అనిచెబుతుంటే ఈ చిలుక ఏం లెక్కచేయకపోగా…ఆయన్ని కూడా తిట్టిపారేసింది. దీంతో ఆ చిలుకల్ని డిస్ ప్లే నుంచి తీసివేసి మరో చోట ఉంచారు.



కాగా..ఆ చిలుకలను సందర్శనకు ఉంచి ప్రాంతంలో జూ సిబ్బంది మద్యం తాగుతున్నారనీ..ఆ సందర్భంలోవాళ్లు బూతులు కూడా మాట్లడుకోవటంతో అవి విన్న ఆ చిలుకలు ‘f*** off’..“fat b*****d”లాంటి బూతులు మాట్లాడటం నేర్చుకున్నట్లుగా తెలుస్తోంది.