Mamata Banerjee: రేపు మీ పార్టీనీ విడగొడతారు.. బీజేపీకి మమత చురకలు

మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం కావాలి. ఉద్ధవ్‌తోపాటు అందరికీ న్యాయం కావాలి. ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి డబ్బు, కండ బలం, మాఫియా శక్తుల్ని ఉపయోగిస్తున్నారు.

Mamata Banerjee: ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి, శిశసేన ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నట్లుగానే, రేపు ఎవరో ఒకరు బీజేపీని కూడా ఇలాగే విడగొడతారని హెచ్చరించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మహా రాజకీయ సంక్షోభంపై గురువారం మమత స్పందించారు. ఈ అంశంలో బీజేపీ తీరును విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం కావాలి. ఉద్ధవ్‌తోపాటు అందరికీ న్యాయం కావాలి. ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి డబ్బు, కండ బలం, మాఫియా శక్తుల్ని ఉపయోగిస్తున్నారు.

Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం

మహా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు. కానీ, ఏదో ఒక రోజు మీరు వెళ్లిపోతారు. ఆ తర్వాత ఎవరో ఒకరు మీ (బీజేపీ) ప్రభుత్వాన్ని కూలుస్తారు. ఇది చాలా తప్పు. దీన్ని మేం సమర్ధించం. ఒకపక్క అసోం రాష్ట్రం వరదల్లో చిక్కుకుంటే శివసేన ఎమ్మెల్యేల్ని అక్కడికి పంపిస్తారా? ప్రజల్ని ఇబ్బంది పెడతారా? కావాలంటే మహారాష్ట్ర ఎమ్మెల్యేల్ని బెంగాల్ రప్పించండి. వాళ్లకు మేం మంచి ఆతిథ్యం ఇస్తాం. బీజేపీ వాళ్లు ప్రభుత్వాల్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ప్రజలకు న్యాయం కావాలి’’ అని మమత వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు