Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం

బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్లు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది.

Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం

Agnipath (1)

Agnipath: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దాదాపు పది రోజులుగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిరసనల్లో భాగంగా రైల్వే సంస్థలపై దాడులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావడం వల్లే రైళ్లు తగులబెట్టడం, రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం వంటివి చేశారు.

Agniveer: అగ్నివీర్‌లకు ఏ ఉద్యోగాలిస్తారు? ఆనంద్ మహీంద్రాకు ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రశ్న

బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్లు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. వీటన్నింటి వల్ల రైల్వే సంస్థకు భారీ నష్టం కలిగింది. ఇటీవల జరిగిన ఈ ఆందోళనల్లో భారతీయ రైల్వే శాఖకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇందులో టిక్కెట్ల క్యాన్సిలేషన్ డబ్బులు వెనక్కు ఇవ్వడం వల్లే దాదాపు రూ.60 కోట్లకు పైగా నష్టం కలిగింది. దశాబ్ద కాలంగా రైల్వేకు జరిగిన అతిపెద్ద నష్టం ఇదే. సాధారణంగా ఒక జనరల్ కోచ్ తయారీకి రైల్వే శాఖకు రూ.80 లక్షలు ఖర్చవుతాయి. స్లీపర్ కోచ్‌కు రూ.1.25 కోట్లు, ఏసీ కోచ్‌కు రూ.3.5 కోట్లు ఖర్చవుతాయి. ఒక రైలు ఇంజిన్ కోసం రూ.20 కోట్లు ఖర్చవుతాయి.

Revanth Reddy: తెలంగాణ కోసం నిలబడ్డ నేత పీజేఆర్: రేవంత్ రెడ్డి

12 కోచ్‌ల ప్యాసింజర్ రైలుకు రూ.40 కోట్లు ఖర్చైతే, 24 కోచ్‌ల రైలుకు దాదాపు రూ.70 కోట్లు ఖర్చవుతాయని అంచనా. మరోవైపు రైల్వే శాఖ ఇప్పటికే నష్టాల్లో ఉంది. 2020-21లో రైల్వే శాఖకు రూ.467.20 కోట్ల నష్టం వాటిల్లింది. 2019-20లో రూ.100 కోట్లకు పైగా నష్టం కలిగింది. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం క్రిమినల్ చర్య కిందకు వస్తుంది. ఈ ఘటనలో రైల్వేకు నష్టం కలిగించిన వారిపై పోలీసులు, రైల్వే శాఖ క్రమినిల్ కేసులు నమోదు చేస్తుంది.