Revanth Reddy: తెలంగాణ కోసం నిలబడ్డ నేత పీజేఆర్: రేవంత్ రెడ్డి

పేదలు ఇండ్లు కట్టుకుని ధైర్యంగా నిలబడ్డారంటే పీజేఆర్ వల్లే. ఆయనను నమ్ముకుని ఇతర రాష్ట్రాల వారు లక్షలాది మంది హైదరాబాద్ వచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సొంత పార్టీనే నిలదీసిన నేత ఆయన.

Revanth Reddy: తెలంగాణ కోసం నిలబడ్డ నేత పీజేఆర్: రేవంత్ రెడ్డి

Revanth Reddy (1)

Revanth Reddy: తెలంగాణ కోసం సొంత పార్టీనే ఎదిరించి నిలబడ్డ నేత పీజేఆర్ అని, పీజేఆర్ బస్తీలో ఉన్న పేదలకు ఆయన దేవుడితో సమానం అని వ్యాఖ్యానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పీజేఆర్ కూతురు విజయా రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో పీజేఆర్ పేరు తెలియని వారు ఉండరు. పీజేఆర్ అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే పీజేఆర్. బస్తీలో ఉన్న పేదలకు ఆయన దేవుడు.

Vijaya Reddy: పేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే: కార్పొరేటర్ విజయా రెడ్డి

పేదలు ఇండ్లు కట్టుకుని ధైర్యంగా నిలబడ్డారంటే పీజేఆర్ వల్లే. ఆయనను నమ్ముకుని ఇతర రాష్ట్రాల వారు లక్షలాది మంది హైదరాబాద్ వచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సొంత పార్టీనే నిలదీసిన నేత ఆయన. కృష్ణా నది నీళ్ల కోసం పోరాటాలు చేశారు. నీళ్ల కోసం జంట నగరాల్లో కుండల ప్రదర్శన నేర్పించిందే పీజేఆర్. కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల వంటి ప్రాజెక్టులు పీజేఆర్ వల్లే వచ్చాయి. 26 మంది ఎమ్మెల్యేలే గెలిచినా పేదల పక్షాన అలుపెరగని పోరాటం చేశారు. 1994-99లోనే ఖాళీ కుండలతో అసెంబ్లీలో నిరసన తెలిపి, కృష్ణా-గోదావరి జలాలు హైదరాబాద్ తెచ్చారు. ఇప్పుడు కొంతమంది మిషన్ భగీరథ అని చెప్పుకొంటున్నారు. పీజేఆర్ ఉంటే ఇబ్రహీంపట్నంలో ఒక్క ఎకరా భూమి కూడా పోకపోతుండే. పీజేఆర్ లేని లోటు తెలంగాణకు, కాంగ్రెస్ పార్టీకి ఉంది. పార్టీ నుంచి బహిష్కరించినా పార్టీని వీడలేదు.

IIT-Delhi Student: ప్రపంచంలోనే టాప్ కోడర్‌గా గెలిచిన ఐఐటీ-స్టూడెంట్

విజయా రెడ్డిని పార్టీలో చేర్పించే బాధ్యత కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీసుకున్నారు. జంట నగరాల్లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. జూబ్లీహిల్స్ నడిబొడ్డున పేదలకు గుడి ఉండాలని పీజేఆర్ పెద్దమ్మ తల్లి గుడి కట్టించారు. ఇప్పుడు ఆ పెద్దమ్మ గుడి దగ్గరే అరాచకం జరుగుతోంది. హైదరాబాద్‌కు వరదలు వస్తే పేదోడికి ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదు. రూ.600 కోట్లు ఏమయ్యాయి? పార్టీలో మిగతా నాయకులకు లభించే గౌరవ మర్యాదలు విజయా రెడ్డికి ఉంటాయి. నగర కాంగ్రెస్ దళపతులుగా విజయా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ కుటుంబాలు పోరాడుతాయి’’ అని చెప్పొకొచ్చారు రేవంత్ రెడ్డి.