IIT-Delhi Student: ప్రపంచంలోనే టాప్ కోడర్‌గా గెలిచిన ఐఐటీ-స్టూడెంట్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ కలాశ్ గుప్తా టీసీఎస్ కోడ్‌విటా సీజన్ 10లో విజేతగా నిలిచారు. ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న గుప్తా ఆ గౌరవం దక్కించుకున్నారు.

IIT-Delhi Student: ప్రపంచంలోనే టాప్ కోడర్‌గా గెలిచిన ఐఐటీ-స్టూడెంట్

Iit Delhi Student

IIT-Delhi Student: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ కలాశ్ గుప్తా టీసీఎస్ కోడ్‌విటా సీజన్ 10లో విజేతగా నిలిచారు. ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న గుప్తా ఆ గౌరవం దక్కించుకున్నారు. ఈ పోటీలో 87దేశాలకు చెందిన లక్ష మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

కలాశ్ గుప్తా జాతీయవ్యాప్తంగా జరిగిన జేఈఈ పరీక్షలో 3వ ర్యాంకు సాధించారు. 2018లో ఐఐటీ అడ్మిషన్ పొందిన కలాశ్.. ఢిల్లీ జోన్ మొత్తంలో టాప్ గా నిలిచారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ హోదా దక్కించుకున్న కోడింగ్ పోటీ కోడ్‌విటా, ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీగా నిలిచింది. కోడ్‌విటా కాంటెస్ట్‌లోని నలుగురు విజేతలు TCS రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని పొందుతారు.

Read Also: క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఐదుగురు ఐఐఐటీ విద్యార్థులకు రూ.కోటికి పైగా వేతనం

పలు యూనివర్సిటీలకు చెందిన 21 మంది భారతీయ విద్యార్థుల పేర్లు ప్రపంచంలోని టాప్ కోడర్‌ల జాబితాలో చేర్చారు.

కలాష్‌తో పాటు, చిలీ, తైవాన్‌లకు చెందిన పోటీదారులు వరుసగా రెండు, మూడో స్థానాలను దక్కించుకున్నారు. పోటీలో గెలుపొందిన తర్వాత, గుప్తాను IIT ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ సత్కరించారు.

“పోటీని ప్రారంభించినప్పుడు, టాప్ 3లో కూడా ఉంటానని అనుకోలేదు, ఇది చాలా వినయపూర్వకమైన అనుభవం. ప్రైజ్ మనీ ($10,000) గురించి చాలా సంతోషిస్తున్నా. ప్రారంభించినప్పుడు నమ్మకంగా అనిపించలేదు. మొదటి సమస్యను పరిష్కరించేందుకు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం గడిచింది. తర్వాత ఇతర సమస్యలను పరిష్కరిస్తూ, ఫైనల్ స్టేజిపై మరింత విశ్వాసాన్ని పొందగలిగాను. టాప్ 3లో ఉంటానని నమ్మకం కలిగింది” అని తన అద్భుతమైన విజయం తర్వాత గుప్తా పేర్కొన్నాడు.