Vijaya Reddy: పేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే: కార్పొరేటర్ విజయా రెడ్డి Vijaya Reddy joins congress party

Vijaya Reddy: పేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే: కార్పొరేటర్ విజయా రెడ్డి

ఖైరతబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణ పడి ఉంటా. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీములు పెట్టామని గొప్పగా చెప్పుకున్నా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. 

Vijaya Reddy: పేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే: కార్పొరేటర్ విజయా రెడ్డి

Vijaya Reddy: పదవుల కోసం పార్టీ మారలేదని, కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేయగలదని భావిస్తున్నట్లు చెప్పారు కార్పొరేటర్ విజయా రెడ్డి. టీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన విజయారెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయా రెడ్డి మాట్లాడారు. ‘‘ఖైరతబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణ పడి ఉంటా. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీములు పెట్టామని గొప్పగా చెప్పుకున్నా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి.

IIT-Delhi Student: ప్రపంచంలోనే టాప్ కోడర్‌గా గెలిచిన ఐఐటీ-స్టూడెంట్

పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల బాగోగులు పక్కన పెట్టింది. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుంది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికే వచ్చాను. నేను పదవుల కోసం పార్టీ మారలేదు. ఇక మూడు రంగుల జెండా వదలను. నాది ఇక ఒకటే జెండా..ఒకటే బాట’’ అని విజయా రెడ్డి వ్యాఖ్యానించారు.

×