Agniveer: అగ్నివీర్‌లకు ఏ ఉద్యోగాలిస్తారు? ఆనంద్ మహీంద్రాకు ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రశ్న

మీ సంస్థలో అగ్నివీర్‌లకు ఎలాంటి ఉద్యోగం ఇస్తారు? నేను తాజ్ ఘటనలో అదానీ సహా 185 మందిని కాపాడాను. అయినా, ఇప్పటికీ ఉపాధి లేకుండా ఉన్నాను. నాలాగే చాలా మంది పదిహేనేళ్లుగా ఉపాధి అవకాశాలు లేకుండానే ఉన్నారు.

Agniveer: అగ్నివీర్‌లకు ఏ ఉద్యోగాలిస్తారు? ఆనంద్ మహీంద్రాకు ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రశ్న

Agniveer

Agniveer: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ నాలుగేళ్లు మాత్రమే ఉద్యోగాన్ని అందిస్తుందనే సంగతి తెలిసిందే. ఈ పథకంలో చేరి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తమ భవిష్యత్ ఏమిటని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తోంది. దీనికి సమాధానంగా ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామిక వేత్తలు తమ సంస్థల్లో ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.

Revanth Reddy: తెలంగాణ కోసం నిలబడ్డ నేత పీజేఆర్: రేవంత్ రెడ్డి

అయితే, ఏ ఉద్యోగాలు ఇస్తారో చెప్పాలని ప్రశ్నిస్తున్నాడు మాజీ సర్వీస్‌మాన్ ప్రవీణ్ కుమార్ తియోటియా. ఆయన గతంలో ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. 2008 నవంబర్‌లో ముంబైలోని తాజ్ హోటల్‌పై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డ ఘటనలో భారత్ తరఫున పోరాడిన సైనికుల్లో ఆయన ఒకరు. ఈ దాడి ఘటనలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీతోపాటు 185 మంది ప్రాణాల్ని కాపాడిన వీరుల్లో ఈయన కూడా ఉన్నారు. అయితే, రిటైర్మెంట్ తర్వాత దాదాపు పదిహేనేళ్ళుగా ఉపాధి లేక ఖాళీగానే ఉంటున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. ‘‘మీ సంస్థలో అగ్నివీర్‌లకు ఎలాంటి ఉద్యోగం ఇస్తారు? నేను తాజ్ ఘటనలో అదానీ సహా 185 మందిని కాపాడాను. అయినా, ఇప్పటికీ ఉపాధి లేకుండా ఉన్నాను. నాలాగే చాలా మంది పదిహేనేళ్లుగా ఉపాధి అవకాశాలు లేకుండానే ఉన్నారు. కానీ మీరు వాళ్లకు ఇప్పటివరకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదు’’ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Vijaya Reddy: పేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే: కార్పొరేటర్ విజయా రెడ్డి

మరికొందరు మాజీ ఆర్మీ ఉద్యోగులు కూడా ఇలాగే ప్రశ్నిస్తున్నారు. ‘ఆనంద్ మహీంద్రా ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే అగ్నిపథ్ స్కీం వచ్చే వరకు ఎందుకు ఆగాలి.. ఇప్పటికే పని చేసి రిటైరైన ఎందరో ఆర్మీ జవాన్లు, ఆఫీసర్లు ఉన్నారు. వాళ్లందరూ క్రమశిక్షణ, నైపుణ్య కలిగిన వాళ్లు. వాళ్లకు ఉద్యోగాలివ్వొచ్చు కదా’ అని ప్రశ్నిస్తున్నారు.