Bajrangi Bhaijaan: బజరంగీ భాయిజాన్ సీక్వెల్ రెడీ..?

స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు సూపర్ హిట్ సినిమాలకు కథలను అందిస్తూ వచ్చిన ఆయన ఇటీవల కాలంలో బిగ్గెస్ట్....

Sequel Story Ready For Bajrangi Bhaijaan Says Vijayendra Prasad

Bajrangi Bhaijaan: స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు సూపర్ హిట్ సినిమాలకు కథలను అందిస్తూ వచ్చిన ఆయన ఇటీవల కాలంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌కు కథలను అందించి తన ప్రతిభను యావత్ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత విజయేంద్ర ప్రసాద్ అందించే కథలు జనాలకు బాగా రీచ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన నుండి వచ్చిన ‘బాహుబలి’ చిత్ర కథ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అయితే బాహుబలి సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని బాహుబలి-2 చిత్రంతో ప్రపంచస్థాయి గుర్తింపును దక్కించుకున్నారు ఈ రైటర్.

బాహుబలి చిత్రం రిలీజ్ అయిన అదే ఏడాదిలో బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటారు విజయేంద్ర ప్రసాద్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ‘బజరంగీ భాయిజాన్’ చిత్రానికి అద్భుతమైన కథను అందించి.. అది దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించారు ఈ స్టార్ రైటర్. ఒక సాధారణ కథకు ఎమెషన్స్‌ను జోడించి ఆయన రాసిన తీరు అద్భుతంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు బజరంగీ భాయిజాన్ చిత్రాన్ని ఆదరించి అంత పెద్ద హిట్ చేశారు. అయితే బాహుబలి చిత్రానికి సీక్వెల్ అందించి, దాన్ని ప్రపంచస్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిపిన విజయేంద్ర ప్రసాద్, బజరంగీ భాయిజాన్ చిత్రానికి కూడా సీక్వెల్ కథ రాస్తే బాగుంటుందని చాలా మంది కోరుకున్నారు.

Salman Khan: చిరుకు సల్మాన్ కండీషన్.. సెట్ నుండి వెళ్లిపోతానంటూ వార్నింగ్!

ఇదే విషయాన్ని చాలా మంది ఆయన్ను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన ఓ కథ రాశారంటే, దానికి మొదలు ఎలా ఉండాలో.. దాని ప్రయాణం మధ్యలో ఎలా ఉండాలో.. దాని ముగింపు ఎలా ఉండాలో పర్ఫెక్ట్‌గా కుదిరితేనే, ఇతరులకు ఆయన దాన్ని వినిపిస్తారు. ఇప్పుడు బజరంగీ భాయిజాన్ విషయంలో కూడా ఆయన ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అందుకే బజరంగీ భాయిజాన్ సినిమాను ఎలా ప్రారంభించి, ఎలా ముగించారో… దానికి సీక్వెల్‌గా కథను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనే విషయాలపై కొంతకాలంగా వర్కవుట్ చేస్తున్నారట. కాగా ఎట్టకేలకు బజరంగీ భాయిజాన్‌కు సీక్వెల్ కథను పూర్తి చేశారట ఈ స్టార్ రైటర్.

Salman-Sonakshi: సల్మాన్‌తో సీక్రెట్ పెళ్లి.. సోనాక్షి రియాక్షన్ ఇదే!

అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరినట్లు ఆయన ఫిక్స్ అయిన తరువాతే ఈ కథను హీరో సల్మాన్ ఖాన్‌కు వినిపించారట. అయితే ఈ కథ చాలా కొత్తగా ఉండటం, ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం సల్మాన్‌కు కలగడంతో ఆయన కూడా ఈ సీక్వెల్‌కు సై అన్నారట. అయితే ఈ సినిమాను బజరంగీ భాయిజాన్ తెరకెక్కించిన దర్శకుడు కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తాడా లేక వేరొక డైరెక్టర్ రంగంలోకి దిగుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా చాలా కాలంగా ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బజరంగీ భాయిజాన్ చిత్రానికి సీక్వెల్ స్టోరీ రెడీ అయ్యిందనే వార్తతో అటు నార్త్‌లోనే కాకుండా సౌత్‌లోని ఆడియెన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.