Shivsena Uddav
Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర మంత్రి, సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండేపై పార్టీ పరంగా శివసేన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు శివసేన పార్టీ ఓ ప్రకటన చేసింది. అలాగే, శివసేన శాసనసభా పక్ష నేత హోదా నుంచి ఆయనను తొలగిస్తున్నట్లు తెలిపి, ఆ పదవిలో ఇకపై శివ్‌డీ ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమిస్తున్నట్లు పేర్కొంది.
congress: ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కాగా, గుజరాత్‌లోని ఓ హోటల్‌లో దాదాపు 10 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే ఉన్న విషయం తెలిసిందే. కాసేపట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. తనవైపు ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఆయన షాక్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శివసేన ఈ చర్యలు తీసుకుంది.