congress: ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

congress: ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Congress

congress: కాంగ్రెస్ నేతల ఆందోళ‌న‌ల‌తో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెల‌కొంది. నేష‌న‌ల్ హెరాల్డ్ దిన‌ప‌త్రిక‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నేడు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచారిస్తోన్న విష‌యం తెలిసిందే. రాహుల్ గాంధీని ప‌దే ప‌దే విచార‌ణ‌కు పిలుస్తూ ఈడీ వేధిస్తోందంటూ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆందోళ‌న‌కు దిగారు. రాహుల్ గాంధీకి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.

International Yoga Day: తాజ్‌ మ‌హ‌ల్‌, ఆగ్రా కోట స‌హా స్మార‌క చిహ్నాల్లో నేడు ప్ర‌వేశం ఉచితం

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ నేతల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. సెంట్రల్ ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉన్నందున అనుమతి నిరాక‌రించిన‌ట్లు తెలిపారు. కొంద‌రు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. మ‌రోవైపు, ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష కొన‌సాగుతోంది. అనుమతి ఉన్న వారిని మాత్ర‌మే పోలీసులు లోపలకు పంపిస్తున్నారు. గుంపులు గుంపులుగా వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రం అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలిస్తున్నారు.