HBD Sai Pallavi: శ్యామ్ సింగ రాయ్ లుక్.. సాయిపల్లవి ఉగ్రరూపం!
భానుమతి ఒక్కటే పీస్.. ఈ డైలాగ్ వినగానే మనకి సాయిపల్లవి గుర్తొస్తుంది కదా. సాయిపల్లవి కథల ఎంపికకు కూడా ఈ డైలాగ్ చక్కగా సరిపోతుందేమో. తనకు నప్పే పాత్రలతో పాటు తన మేనరిజానికి సెట్ అయ్యే పాత్రలనే ఒకే చేసే ఒక్కో మెట్టు ఎక్కుతుంది.
- Naresh Mannam
- Published On : May 9, 2021 / 12:53 PM IST
Hbd Sai Pallavi
HBD Sai Pallavi: భానుమతి ఒక్కటే పీస్.. ఈ డైలాగ్ వినగానే మనకి సాయిపల్లవి గుర్తొస్తుంది కదా. సాయిపల్లవి కథల ఎంపికకు కూడా ఈ డైలాగ్ చక్కగా సరిపోతుందేమో. తనకు నప్పే పాత్రలతో పాటు తన మేనరిజానికి సెట్ అయ్యే పాత్రలనే ఒకే చేసే ఒక్కో మెట్టు ఎక్కుతుంది. పాత్ర ఎంపిక నుండి ఆ పాత్రలో పరకాయప్రవేశం చేసి సినిమాకు వందకు వంద శాతం న్యాయం చేయడంలో సాయిపల్లవి ఫుల్ మార్కులు కొట్టేసింది. కాగా, సాయిపల్లవి ప్రస్తుతం నేచురల్ స్టార్ నానికి జోడిగా ’శ్యామ్ సింగ రాయ్‘ సినిమాలో నటిస్తుంది.
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లు కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాయిపల్లవి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ’శ్యామ్ సింగ రాయ్‘ నుంచి ఆమె లుక్ ను విడుదల చేశారు. సాంప్రదాయ బెంగాలీ చీరకట్టు.. ముక్కుకు ముక్కెర.. నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు.. కణకణ మండుతున్న శూలం చేపట్టి కాళికాదేవి అవతారంలో ఎంతో గంభీరంగా ఉగ్రరూపం దాల్చినట్టుగా ఉన్న సాయి పల్లవి లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
From the Holy ghats of Devi Maatha 🔱
Unfolding the Gracious First look & Wishing our enduring beauty @Sai_Pallavi92 a very Happy Birthday 😊
-Team #ShyamSinghaRoy #HBDSaiPallavi ❤️@NameisNani @IamKrithiShetty @MadonnaSebast14 @Rahul_Sankrityn @vboyanapalli @SVR4446 pic.twitter.com/qTIWQPYnkm
— Niharika Entertainment (@NiharikaEnt) May 9, 2021
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ గా మారింది. గతంలో నాని బర్త్ డే కానుకగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నేచురల్ స్టార్ గా.. ప్రతి సినిమాలో ఏదోఒక గట్టి అంశాన్ని ముడిపడి ఉండేలా చూసుకొనే నానీ.. పాత్రలో కొత్తదనం ఉంటేనే ఒకే చేసే సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బెంగాల్ నేపథ్యంలో జరిగే ఈ సినిమా కోసం ఏకంగా హైదరాబాద్ లో 10 ఎకరాల స్థలంలో భారీ కోల్ కతా సెట్ నిర్మించి షూట్ చేస్తున్నారు.
