smriti-irani
National Herald case: గాంధీ కుటుంబానికి సంబంధించిన రూ.2,000 కోట్ల ఆస్తులను కాపాడడానికి, అవినీతికి మద్దతు తెలపడానికే కాంగ్రెస్ పార్టీ నేడు నిరసన ప్రదర్శన నిర్వహించిందంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు వెళ్తుండగా ఆ పార్టీ నిర్వహించిన నిరసనపై స్మృతీ ఇరానీ మీడియాతో మాట్లాడారు.
National Herald case: విచారణ ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ.. ఈ ప్రశ్నలు అడిగిన ఈడీ
నిరసన రూపంలో బల ప్రదర్శన చేస్తూ ఈడీపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకు వచ్చే లక్ష్యంతోనే ర్యాలీ నిర్వహించిందని ఆమె ఆరోపించారు. రాహుల్ గాంధీ సహా చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆమె అన్నారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌కు చెందిన రూ.2,000 కోట్లను సొంతం చేసుకునేందుకు గాంధీ కుటుంబం యంగ్ ఇండియా సంస్థను స్థాపించిందని స్మృతీ ఇరానీ ఆరోపించారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి చర్యకు పాల్పడలేదని ఆమె అన్నారు. హవాలా ఆపరేటర్ డోటెక్స్ మర్చండైజ్‌కు గాంధీ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటని రాహుల్ గాంధీని కాంగ్రెస్ శ్రేణులు అడగాలని ఆమె అన్నారు.