Snake: బూటులో పాము.. యువ‌తిపై ప‌డ‌గ విప్పి బుస‌లు.. వీడియో వైర‌ల్

పామును ప‌ట్టి తీసుకెళ్ళ‌డానికి ఓ యువ‌తి వ‌చ్చింది. బూటులో దాగి ఉన్న పాము బ‌య‌ట‌కు వ‌స్తూనే ప‌డ‌గ విప్పి బుస‌లు కొట్టింది. ఆ పామును ఆ యువ‌తి ప‌ట్టుకునే క్ర‌మంలో దాదాపు కాటేసినంత ప‌ని చేసింది.

Snake

Snake: వ‌ర్షాకాలంలో పాములు, పురుగుల బెడ‌ద ఎక్కువ‌గా ఉంటుంది. అవి ఇంట్లోకి కూడా వ‌స్తుంటాయి. పాములు వ‌చ్చి ఇంట్లో ఏదో చోట ఉంటూ మ‌నిషి ప్రాణాల‌కు హాని క‌లిగిస్తుంటాయి. అవి దేనిలో దూరాయో క‌నిపెట్ట‌డం కూడా క‌ష్టమే. తాజాగా, ఓ వ్య‌క్తి బూటులో దూరింది ఓ పాము. ఇందుకు సంబంధించిన వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి త‌న ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బూటులో పాము ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించిన ఓ వ్య‌క్తి అట‌వీ శాఖ‌ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.

salt: అద‌నంగా ఉప్పు తీసుకునే వారికి అకాల మ‌ర‌ణ ముప్పు

దీంతో పామును ప‌ట్టి తీసుకెళ్ళ‌డానికి ఓ యువ‌తి వ‌చ్చింది. బూటులో దాగి ఉన్న పాము బ‌య‌ట‌కు వ‌స్తూనే ప‌డ‌గ విప్పి బుస‌లు కొట్టింది. ఆ పామును ఆ యువ‌తి ప‌ట్టుకునే క్ర‌మంలో దాదాపు కాటేసినంత ప‌ని చేసింది. దాని నుంచి ఆ యువ‌తి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుని ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకుని తీసుకెళ్ళింది. ఇంట్లోకి పాములు వ‌స్తే దాన్ని ప‌ట్టుకునేందుకు శిక్షణ తీసుకున్న వారిని పిల‌వాల‌ని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద సూచించారు. ఆయ‌న పోస్టు చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది.